న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుక్స్ అమ్ముకోవడానికి ఇంత దిగజారాలా? వసీం అక్రమ్‌పై సలీమ్ మాలిక్ ఫైర్!

Saleem Malik says former Wasim Akrams wants publicity over his servant allegations

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తన బయోగ్రఫీ 'సుల్తాన్ : ఎ మెమోయిర్'‌లో పేర్కొన్న విషయాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ సీనియర్ అనే కారణంతో కట్టు బానిసలా చూసేవాడని, బూట్లు, బట్టలు ఉతికించుకునేవాడని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఆరోపణలను సలీమ్ మాలిక్ ఖండించాడు.

పుస్తకాలు అమ్ముకోవడానికి వసీం అక్రమ్ ఉపయోగిస్తున్న చీప్ ట్రిక్ అని మండిపడ్డాడు. వాషింగ్ మెషిన్‌లు ఉండగా.. అతనిచేత బట్టలు ఎందుకు ఉతికిస్తానని ప్రశ్నించాడు. అంతేకాకుండా స్వార్థపరుడినైతే తన సారథ్యంలో వసీం అక్రమ్‌ను ఎలా ఆడాడని నిలదీశాడు.

ఫోన్ చేస్తే ఎత్త లేదు..

ఫోన్ చేస్తే ఎత్త లేదు..

'అక్రమ్ చేసిన కామెంట్స్‌పై నేను అతనితో మాట్లాడదామని ఫోన్ చేశాను. కానీ నా ఫోన్ ఎత్తలేదు. పాకిస్థాన్ జట్టు తరఫున మేం విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ వాషింగ్ మిషన్స్ ఉండేవి. మేం మా చేతులతో ఉతికే అవసరమే రాలేదు. మరి అక్రమ్ నా బట్టలు ఎప్పుడు ఉతికాడు? మరి నేను నిజంగా స్వార్థపరుడిని అయ్యుంటే నా సారథ్యంలోనే కదా అతను ఆడింది. తన తొలి మ్యాచ్‌ను కూడా నా నాయకత్వంలోనే ఆడాడు.

నేను నిజంగా స్వార్థపరుడిని అయితే అక్రమ్‌కు బౌలింగ్ ఎందుకిస్తా..? బట్టలు ఉతకడం, మసాజ్ చేయడం వంటి పనికిమాలిన కామెంట్స్ చేసి అక్రమ్ తనను తానే తక్కువ చేసుకున్నాడు. అక్రమ్ తన పుస్తకంలో ఏ సెన్స్‌లో ఈ రాతలు రాసుుకొచ్చాడో అతడికే తెలియాలి. పుస్తకాలు అమ్ముకోవాలనే ఉద్దేశంతో అక్రమ్ ఈ చిప్ ట్రిక్ ఫాలో అయ్యాడు'అని మండిపడ్డాడు.

 గతంలో కూడా..

గతంలో కూడా..

గతంలో సలీమ్ మాలిక్ ఓ ఇంటర్వ్యూలో తాను సారథిగా ఉన్నప్పుడు అక్రమ్, వకార్ యూనిస్‌లు తనతో మాట్లాడకపోయేవారని తెలిపాడు. 'నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అక్రమ్‌కు బాల్ ఇవ్వడానికి వెళ్తే అతడు నా చేతుల నుంచి బంతిని లాక్కునేవాడు. అక్రమ్, వకార్ లు నాతో మాట్లాడేవాళ్లు కాదు.'అని తెలిపాడు. తాజాగా అక్రమ్ చేసిన కామెంట్స్‌తో వీళ్లిద్దరి మధ్య విభేదాలు నిజమేనని అర్థమవుతోంది.

ఓ పనోడిలా..

ఓ పనోడిలా..

అక్రమ్ తన పుస్తకంలో.. 'తన కంటే రెండేళ్లు జూనియర్ అయినందుకు అతను ఆ అడ్వంటేజీని తీసుకునేవాడు. నాతో ఎప్పుడూ నెగిటివ్ గా ఉండేవాడు. సెల్ఫిష్. ఎప్పుడూ నన్ను తనకు ఓ పనోడిలా భావించేవాడు. తనకు మసాజ్ చేయమని అడిగేవాడు. తన మాసిన బట్టలు, బూట్లను ఉతకమనేవాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది.'అని రాసుకొచ్చాడు.

ఈ ఇద్దరూ కలిసి చాలాకాలం పాటు పాకిస్థాన్ జట్టు తరఫున ఆడారు. ఇమ్రాన్ ఖాన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక పాకిస్థాన్ సారథిగా సలీమ్ మాలిక్ ఎంపికయ్యాడు. 1992 నుంచి 1995 వరకు అక్రమ్.. మాలిక్ సారథ్యంలోనే ఆడాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయని అప్పట్లో పాకిస్థాన్ మీడియాలో వరుస కథనాలు వెలువడ్డాయి. సలీమ్ మాలిక్.. 2000 ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కొని జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు.

Story first published: Tuesday, November 29, 2022, 15:08 [IST]
Other articles published on Nov 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X