న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇదే నా హెచ్చరిక.. ఫిక్సర్‌గా అభివర్ణిస్తే కోర్టుకి లాగుతా'

Saleem Malik hits back at people calling him a match-fixer

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. పలు ద్వైపాక్షిక సిరీస్‌తో పాటు పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కూడా పాక్ ఆటగాళ్లు ఫిక్సింగ్‌లకు పాల్పడ్డారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన పలువురు ఆటగాళ్లపై పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిషేధం విధించింది. ఫిక్సింగ్ కారణంగా క్రికెట్ కెరీర్‌ని నాశనం చేసుకున్న పాక్ క్రికెటర్లలో సలీమ్ మాలిక్ కూడా ఒకడు.

ధోనీ సహజసిద్ధ కీపర్‌ కాదు.. కార్తీక్‌ నేచురల్‌ ప్లేయర్‌: తైబుధోనీ సహజసిద్ధ కీపర్‌ కాదు.. కార్తీక్‌ నేచురల్‌ ప్లేయర్‌: తైబు

ఫిక్సర్ ముద్ర మాత్రం చెరిగిపోలేదు:

ఫిక్సర్ ముద్ర మాత్రం చెరిగిపోలేదు:

1982లో పాకిస్థాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సలీమ్ మాలిక్.. తన అద్భుత ఆటతో అత్యుత్తమ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్నాడు. కష్టాల్లో ఉన్న జట్టును ఎన్నోసార్లు ఆదుకున్నాడు. కెరీర్‌లో 103 టెస్టులు, 283 వన్డేలు ఆడిన సలీమ్.. మొత్తం 20 సెంచరీలు బాదాడు. అయితే కెరీర్‌ మంచి ఊపులో ఉండగానే సలీమ్ మాలిక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి.దీంతో పీసీబీ అతనిపై జీవితకాలం నిషేధం విధించింది. అయితే ఎనిమిదేళ్ల తర్వాత ఆ నిషేధాన్ని లాహోర్ సివిల్ కోర్టు ఎత్తివేసినా.. ఇప్పటికీ అతనిపై ఉన్న ఫిక్సర్ ముద్ర మాత్రం చెరిగిపోలేదు.

 ఫిక్సర్‌గా అభివర్ణిస్తే కోర్టుకి లాగుతా:

ఫిక్సర్‌గా అభివర్ణిస్తే కోర్టుకి లాగుతా:

పాకిస్థాన్‌లో ఫిక్సింగ్‌ గురించి చర్చ వచ్చిన ప్రతిసారి సలీమ్ మాలిక్ పేరు కూడా తెరపైకి వస్తోంది. దాంతో ఆగ్రహం వ్యక్తం చెందిన సలీమ్ మాలిక్.. ఇకపై ఎవరైనా తనని ఫిక్సర్‌గా అభివర్ణిస్తే కోర్టుకి లాగుతానని హెచ్చరించాడు. తాజాగా సమా టీవీతో సలీమ్ మాట్లాడుతూ... 'మ్యాచ్ ఫిక్సింగ్‌తో నా పేరుని ముడిపెట్టే వారిని హెచ్చరిస్తున్నా. నేను నిర్దోషినని ఇప్పటికే లాహోర్ సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. నాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా నన్ను ఫిక్సర్‌గా అభివర్ణిస్తే? వాళ్లని కోర్టుకి లాగుతా' అని మాలిక్ అన్నాడు.

 17 ఏళ్ల పాటు అంతర్జాతీయ కెరీర్:

17 ఏళ్ల పాటు అంతర్జాతీయ కెరీర్:

తన నిషేధాన్ని ఎత్తివేయాలని కొద్ది రోజుల క్రితం మాలిక్ పీసీబీని కోరాడు. పాకిస్తాన్ యువ క్రికెటర్లు తన నుండి నేర్చుకోవటానికి ఆస్కారం ఉందన్నాడు. యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసే వారికి 100 టెస్టులకు పైగా అనుభవం ఉండాలని మాజీ కెప్టెన్ ఇంజామామ్-ఉల్-హక్ అన్న విషయం తెలిసిందే. 57 ఏళ్ల మాలిక్.. కోచింగ్ పాత్రల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి తిరస్కరించబడ్డాడు. 17 ఏళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన సలీమ్.. వన్డేల్లో 7,170 పరుగులు, టెస్టుల్లో 5,768 పరుగులు బాదాడు.

Story first published: Tuesday, June 9, 2020, 11:35 [IST]
Other articles published on Jun 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X