న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Salaam Cricket 2019: '16 ఏళ్ల వయసులో సచిన్‌ను బౌన్సర్లతో భయపెట్టాం'

Salaam Cricket 2019: 16-year-old Sachin Tendulkar thought his career was over after Test debut

హైదరాబాద్: 1989లో కరాచీ వేదికగా పాక్‌తో ఆడిన తన తొలి టెస్టు మ్యాచే ఆఖరి టెస్టు మ్యాచ్ అని అనుకున్నానని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. వరల్డ్‌కప్-2019 నేపథ్యంలో ఇండియా టూడే నిర్వహించిన సలామ్‌ క్రికెట్‌ 2019 కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌ తొలి రోజులను గుర్తు చేసుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తన తొలి టెస్టు మ్యాచ్‌లో సచిన్‌ కేవలం 15 పరుగులే చేసి వకార్‌ యూనిస్‌ బౌలింగ్‌లో ఔటైన సంగతి తెలిసిందే. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోవడంతో తన తొలి టెస్టు ఆఖరి టెస్టు మ్యాచ్ అనుకున్నానని సచిన్ తాజాగా వెల్లడించాడు.

200 టెస్టులు ఆడి 15,921 పరుగులు

200 టెస్టులు ఆడి 15,921 పరుగులు

తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌‌లో సచిన్ 200 టెస్టులు ఆడి 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. తాజాగా సచిన్ మాట్లాడుతూ "నేను బ్యాటింగ్‌ వెళ్లినప్పుడు యార్కర్‌ కోసం ఎదురు చూస్తున్నాను. అయితే అక్రమ్ బౌన్సర్లు సంధించాడు. అప్పట్లో ఇన్ని బౌన్సర్లే వెయ్యాలనే నియమాలు లేవు" అని అన్నాడు.

బౌన్సర్లతోనే నాకు స్వాగతం పలికారు

బౌన్సర్లతోనే నాకు స్వాగతం పలికారు

"దీంతో బౌన్సర్లతోనే నా టెస్టు క్రికెట్‌కు స్వాగతం పలికిందని భావించా. అప్పటివరకూ నేను ఎదుర్కోని బంతులను అక్రమ్, వకార్‌లు విసిరారు. అలాంటి బంతులను గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. దీంతో టెస్టుల్లో నా స్థానం పోయిందని భావించా. ఆ క్షణం సిగ్గుతో మైదానాన్ని వీడాను" అని సచిన్ చెప్పుకొచ్చాడు.

నా మొదటి టెస్టే ఆఖరి టెస్టు అని భావించా

నా మొదటి టెస్టే ఆఖరి టెస్టు అని భావించా

"దీంతో నేను నా మొదటి టెస్టే ఆఖరి టెస్టు అని భావించాను. ఔటైన అనంతరం నేరుగా వాష్‌రూమ్‌లోకి వెళ్లి అద్దంలో నా మొహం చూసుకొని ఇంకొక్క అవకాశం వస్తే నిరూపించుకోవాలి అనుకున్నా" అని సచిన్ తెలిపాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ గురించి పాక్ పేస్ దిగ్గజం వసీమ్ అక్రమ్ కూడా స్పందించాడు.

నాకు ఇప్పటికీ గుర్తు

నాకు ఇప్పటికీ గుర్తు

"నాకు ఇప్పటికీ గుర్తుంది. పాక్‌ పర్యటనకు ముందే భారత జట్టు ఓ యువ ఆటగాడితో వస్తుందని తెలిసింది. 16 ఏళ్ల కుర్రాడు టెస్టు మ్యాచ్‌ ఆడటం ఏంటని మేమంతా అనుకున్నాం. కానీ, మా పేసర్ల నుంచి ఎదురైన విమర్శలను సైతం పట్టించుకోలేదు. ప్రత్యర్థులు నన్ను చూసి నవ్వితే నాకు నచ్చేది కాదు. ఆ పర్యటనతో సచిన్‌ అంటే ఏంటో మా జట్టుకు తెలిసొచ్చింది. అతడో ప్రత్యేక ఆటగాడు అని అర్థమైంది" అని అక్రమ్ అన్నాడు.

Story first published: Monday, June 3, 2019, 19:15 [IST]
Other articles published on Jun 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X