హెల్మెట్ వాడని క్రికెటర్‌కు జన్మదిన శుభాకాంక్షలు: సచిన్

Posted By:
Sachin Tendulkar wishes his ‘batting hero’ Viv Richards on 66th birthday

హైదరాబాద్: హెల్మెట్ వాడకుండా బౌలర్‌కు ముచ్చెమటలు పట్టించే బ్యాట్స్‌మన్ వివ్ రిచర్డ్స్. ఆయన బుధవారం 66వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌కు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. ఈ వెస్టిండీస్‌ ఆటగాడు, తాను కలిసి ఉన్న ఫొటోను సచిన్‌ ట్విటర్‌లో ఉంచి, 'నా బ్యాటింగ్‌ హీరో రిచర్డ్స్‌కు జన్మదిన శుభాకాంక్షలంటూ' పోస్ట్‌ చేశాడు.

క్రికెట్‌ చరిత్రలో రిచర్డ్స్‌ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌గా ఎనలేని పేరు ప్రఖ్యాతలు గడించిన సంగతి తెలిసిందే. ఎన్నో తరాల ఆటగాళ్లకు రిచర్డ్స్‌ ఎప్పటికీ ఆదర్శనీయమే. రెండు దశాబ్దాల పాటుగా వెస్టిండీస్‌‌ జట్టు అత్యుత్తమ ప్రదర్శన సాగించిందంటే అదంతా రిచర్డ్స్‌ వల్లనే సాధ్యపడింది. ఒకవైపు జట్టులో ఫాస్ట్‌ బౌలర్ల హవా కొనసాగుతున్నా, రిచర్డ్స్‌ మాత్రం విధ్వంసక బ్యాటింగ్‌తో క్రికెట్‌ అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు.

121 టెస్టులాడిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ 50.23సగటుతో 8,540పరుగులు సాధించాడు. వెస్టిండీస్‌ 1975, 79ల్లో ప్రపంచ కప్‌ సాధించడంలోనూ రిచర్డ్స్ కీలక పాత్ర పోషించాడు. అనంతరం 1980-91లలో వెస్టిండీస్‌ జట్టుకు సారథ్యం వహించాడు.
హెల్మెట్‌ ధరించడు..
రిచర్డ్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అసలు హెల్మెట్‌ ధరించడట.

హెల్మెట్ ధరించకపోవడానికి కారణం:
చిన్నతనంలో క్రికెట్‌ ఆడుతున్నప్పుడు దేశ చిహ్నం ఉన్న టోపీని తలపై పెట్టుకోవడం గొప్ప అవకాశంగా భావించేవాడట. ఆ టోపీ ధరించడం దేశానికి గర్వకారణంగా పేర్కొన్నాడు. తీరా అవకాశం వచ్చాక బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఆ టోపీకి ఎక్కడ న్యాయం చేయలేకపోతానో అనే ఆందోళనతో ఎప్పుడూ టోపీ ధరించడానికి ఇష్టపడేవాడు కాదట.

Story first published: Thursday, March 8, 2018, 8:22 [IST]
Other articles published on Mar 8, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి