న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

21వ శతాబ్ధపు ఉత్తమ టెస్ట్ ఆటగాడిగా సచిన్

మెల్బోర్న్: క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 21వ శతాబ్ధపు ఉత్తమ టెస్ట్ ఆటగాడిగా ఎన్నికయ్యాడు. క్రికెట్ ఆస్ట్రేలియా(సిఏ) వెబ్‌సైట్ నిర్వహించిన ఆన్‌లైన్ ఎన్నికల్లో సచిన్ టెండూల్కర్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయి.

సిఏ అధికారిక వెబ్‌సైట్ క్రికెట్.కామ్.ఏయూ జరిపిన ఆన్‌లైన్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర, మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆడం గిల్ క్రిస్ట్ నిలిచాడు. ఈ ఎన్నికలకు ముందుగా, 2000 సంవత్సరం నుంచి టాప్-100 టెస్ట్ ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.

16వేలకు పైగా అభిమానులు పాల్గొన్న ఈ ఆన్‌లైన్ ఎన్నికల్లో 23శాతం ఓట్లు గెలుచుకున్న సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. 14శాతం ఓట్లతో కుమార సంగక్కర రెండో స్థానం దక్కించుకున్నాడు.

'పది రోజులపాటు కౌంటింగ్ జరిపిన అనంతరం క్రికెట్.కామ్.ఏయూ ఫలితాలను విడుదల చేసింది. 2000 సంవత్సరం నుంచి 100మంది టెస్ట్ ఉత్తమ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ శతాబ్ధపు నెం.1 ఆటగాడ్ని ఎంపిక చేసే అవకాశం కూడా ఇచ్చాం' అని సిఏ వెబ్‌సైట్ పేర్కొంది.

ఈ జాబితాలో టాప్-10లో భారతదేశం నుంచి సచిన్ ఒక్కడే ఎంపిక కాగా, ఆస్ట్రేలియా నుంచి నలుగురు, దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు, శ్రీలంక నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సచిన్.. 2013లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Sachin Tendulkar voted as the best Test player of 21st century

సచిన్ తన పేరు అనేక రికార్డులను నెలకొల్పాడు. అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. టెస్ట్, వన్డే అంతర్జాతీయ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసింది సచిన్ టెండూల్కరే. 42ఏళ్ల ఈ ఆటగాడు అంతర్జాతీయ మ్యాచుల్లో వంద శతకాలను నమోదు చేశాడు. ప్రస్తుతం సచిన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) జట్టు ముంబై ఇండియన్స్ మెంటర్‌గా కొనసాగుతున్నాడు.

టాప్-10 ఉత్తమ ఆటగాళ్లు

1. సచిన్ టెండూల్కర్ (ఇండియా) 23శాతం ఓట్లు
2. కుమార సంగక్కర (శ్రీలంక) 14శాతం ఓట్లు
3. ఆడం గిల్ క్రిస్ట్(ఆస్ట్రేలియా) 13శాతం ఓట్లు
4. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 11శాతం ఓట్లు
5. జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా) 11శాతం ఓట్లు
6. ఏబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) 10శాతం ఓట్లు
7. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) 9శాతం ఓట్లు
8. గ్లేన్ మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా) 5శాతం ఓట్లు
9. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) 3శాతం ఓట్లు
10. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) 1శాతం ఓట్లు

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X