సడన్‌‌గా సచిన్ రాగా.. పిల్లలతో కలిసి సరదాగా..(వీడియో)

Posted By:
Sachin Tendulkar visits a school in Mumbai, interacts with students and teachers | Oneindia News
Sachin Tendulkar visits a school in Mumbai, interacts with students and teachers

హైదరాబాద్: రాజ్యసభ ఎంపీ, క్రికెట్ దిగ్గజం, టీమిండియా బ్యాట్స్‌మన్ బుధవారం అకస్మాత్తుగా ముంబైలోని గురు గోవింద్ సింగ్ అనే పాఠశాలను సందర్శించారు. అతని రాకతో పిల్లలతో ఆనందానికి అవధుల్లేవ్. అంతేకాదు.. పాఠశాలను పరిశీలించి కావలసిన వసతులు కోసం నిధులు సైతం ప్రకటించడంతో ఉపాధ్యాయులతో సహా అందరూ భావోద్వేగానికి గురైయ్యారు.

అసలేం జరిగింది:
ముంబైలోని ఓ పాఠశాల విద్యార్థులకు బుధవారం అకస్మాత్తుగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వచ్చి పలకరించాడు. ఆ పాఠశాల పూర్తి బాగోగుల గురించి ఆరా తీసి తక్షణమే పాఠశాలను బాగుచేయించి పిల్లలకు సరైన వసతులు కల్పించడంటూ నిధులు మంజూరు చేశాడు. సచిన్‌ బుధవారం దక్షిణ ముంబైలోని స్వెరీ ప్రాంతానికి చెందిన పాఠశాలకు అకస్మాత్తుగా వెళ్లాడు. ఈ క్రమంలో పాఠశాల పిల్లలతో సరదాగా ముచ్చటించాడు.

సచిన్‌ ఇలా అకస్మాత్తుగా పాఠశాల పర్యటన చేయడం ఇది మొదటిసారి కాదు. ఇటీవల కశ్మీర్‌లోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలను కూడా ఇదేవిధంగా వెళ్లాడు. అక్కడి పిల్లలతో సరదాగా గడిపి, వారి పాఠశాల బాగోగుల నిమిత్తం తన రాజ్యసభ ఎంపీ నిధుల కింద రూ.40లక్షలు అందించాడు. ఇక్కడ కూడా..
అనంతరం వారికి కానుకగా క్రికెట్‌ బ్యాట్లు, బంతులు, ఫుట్‌బాల్‌లు అందించాడు. దీనిలో భాగంగా పాఠశాల బాగోగుల గురించి పూర్తిగా తెలుసుకొని సచిన్‌ తన ఎంపీ కోటా కింద నిధులు కూడా అందిస్తున్నట్లు ప్రకటించాడు.

ఈ సందర్భంగా పిల్లలతో మాట్లాడుతూ.. జీవితంలో కొంత వినోదం ఉండాలి. దాంతోపాటు చదువుల విషయంలోనే అదే స్థాయిలో శ్రద్ధ ఉండాలని సూచించాడు. అక్కడి ఉపాధ్యాయులతో సచిన్‌ తన ఆలోచనలు పంచుకున్నాడు. తాను కూడా ఓ ఉపాధ్యాయ కుటుంబం నుంచే రావడంతో తన ఆలోచనలు వారితో పంచుకున్నట్లు సచిన్‌ తెలిపాడు. సచిన్‌ తండ్రి రమేశ్‌ టెండూల్కర్ ఓ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, March 29, 2018, 11:30 [IST]
Other articles published on Mar 29, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి