న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: వరుసగా 11వ టెస్ట్ సిరీస్ విజయం.. భారత జట్టుపై సచిన్, సెహ్వాగ్ ప్రశంసలు!!

Sachin Tendulkar, Virender Sehwag congratulate Team India after massive win over South Africa

పుణె: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ సత్తా చాటడంతో.. టెస్ట్ సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే భారత్ 2-0తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌ విజయంతో టీమిండియా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌లు గెలుపొంది చరిత్ర సృష్టించింది. దీంతో టీమిండియాపై ప్రశంసల వర్షం కుసరుస్తోంది.

<strong>గంగూలీని అభినందించిన మమతా బెనర్జీ.. భార‌త్‌, బంగ్లా గర్వంగా ఉంది!</strong>గంగూలీని అభినందించిన మమతా బెనర్జీ.. భార‌త్‌, బంగ్లా గర్వంగా ఉంది!

ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు

తాజాగా భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, మొహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించారు. 'సొంతగడ్డపై 11 వరుస టెస్ట్ సిరీస్‌లు సాధించిన టీమిండియాకు అభినందనలు. ఈ రికార్డును సాధించడానికి ఆటగాళ్లు చాలా స్థిరత్వం ప్రదర్శించారు. అందరూ అద్భుతంగా రాణించారు' అని సచిన్ ట్వీట్‌ చేశారు.

ఆటను ఇలాగే కొనసాగించండి

'స్వదేశంలో 11 వరుస టెస్ట్ సిరీస్‌లు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియాకు శుభాకాంక్షలు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా గొప్ప రౌండ్ ప్రదర్శన చేస్తోంది. 200 పాయింట్లు సాధించడం గొప్ప ప్రారంభం' అని సెహ్వాగ్ ట్వీట్ చేశారు. 'మరో మంచి విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. ఈ విజయం మొత్తం జట్టు సమిష్టి కృషి. మ్యాచ్ ఆసాంతం బౌలర్లు అద్భుతంగా రాణించారు. సాహా క్యాచ్ సూపర్. ఈ ఆటను ఇలాగే కొనసాగించండి' అని లక్ష్మణ్ పేర్కొన్నారు. ..

వెల్ డన్ టీమిండియా

'దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు. మ్యాచ్‌తో పాటు టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుకు శుభాకాంక్షలు. 'వెల్ డన్' టీమిండియా' అని హర్భజన్ ట్వీట్ చేశారు. 'చాలా సులభంగా స్వదేశంలో వరుసగా 11వ టెస్ట్ సిరీస్ విజయం సాధించారు. బౌలర్ల నుండి అద్భుతమైన ప్రదర్శనను చూసాను. విరాట్ కోహ్లీ క్లాస్ ఆటను మరోసారి ఆడాడు. టీమిండియాకు అభినందనలు' అని కైఫ్ రాసుకొచ్చారు.

సొంతగడ్డపై 11వ టెస్ట్ సిరీస్ విజయం

సొంతగడ్డపై 11వ టెస్ట్ సిరీస్ విజయం

పుణె టెస్టులో కెప్టెన్‌ కోహ్లీ (254) డబుల్ సెంచరీ చేయడంతో టీమిండియా 601/5తో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 275 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం ఫాల్‌ఆన్‌ ఆడిన ప్రొటీస్.. టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 189 పరుగులకే కుప్పకూలింది. కోహ్లీ ఈ మ్యాచ్‌తో పలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. 2015లో జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ స్వదేశంలో జరిగిన ప్రతి టెస్టు సిరీస్‌ను గెలిపించాడు.

Story first published: Monday, October 14, 2019, 16:04 [IST]
Other articles published on Oct 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X