న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్లార్క్ ఏడుగురు అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ జాబితా.. ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు!!

Sachin Tendulkar, Virat Kohli find spot in Michael Clarkes list of greatest batsmen
Micheal Clarke's List Of Greatest Batsmen

బ్రిస్బేన్‌: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న‌తో పాటు క‌లిసి ఆడిన ఏడుగురు అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల జాబితాను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ వెల్ల‌డించాడు. ఇందులో భార‌త్ నుంచి క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌తో పాటు ర‌న్‌మెషీన్ విరాట్ కోహ్లీల‌కు చోటు ద‌క్కింది. తాజాగా బిగ్ స్పోర్ట్స్ బ్రేక్‌ఫాస్ట్‌తో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ ఏడుగురు అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌లు ఎంచుకున్నాడు.

'ఐపీఎల్ డబ్బును ఏంచేయాలో తెలియడం లేదు.. అందుకే తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు''ఐపీఎల్ డబ్బును ఏంచేయాలో తెలియడం లేదు.. అందుకే తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు'

అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ జాబితా:

అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ జాబితా:

మైకేల్ క్లార్క్ అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లీ, విండీస్ దిగ్గ‌జం బ్రియాన్ లారా, మిస్ట‌ర్ 360 ఏబీ డివిలియ‌ర్స్‌, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వ‌స్ క‌లీస్‌, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగ‌క్క‌ర‌లు ఉన్నారు. ఏడు మందిని ప్ర‌పంచంలో గ్రేట్ బ్యాట్స్‌మెన్‌గా క్లార్క్ కొనియాడాడు.

 టెక్నిక్ ప‌రంగా సచిన్‌లో ఏ లోపం లేదు:

టెక్నిక్ ప‌రంగా సచిన్‌లో ఏ లోపం లేదు:

'స‌చిన్ టెండూల్క‌ర్‌ వికెట్ తీయ‌డం కంటే క‌ష్ట‌మైన‌ది మ‌ర‌కొటి లేద‌నుకుంటా. టెక్నిక్ ప‌రంగా అత‌డిలో ఏ లోపం లేదు. అత‌డు త‌ప్పు చేసేవ‌ర‌కు వేచి చూడ‌టం త‌ప్ప ఇంకో మార్గం ఉండ‌దు. సాంకేతికంగా నేను చూసిన ఉత్తమ బ్యాట్స్‌మన్‌' అని క్లార్క్ అన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ తన కెరీర్లో 200 టెస్టులు, 463 వన్డేలు ఆడాడు. అతని పేరుపైనే 100 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఎన్నో ప్రపంచ రికార్డులు సచిన్ పేరుపైనే ఉన్న విషయం తెలిసిందే.

కోహ్లీని మించినోడు లేడు:

కోహ్లీని మించినోడు లేడు:

'ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీని మించినోడు లేడు. ముఖ్యంగా టెస్టుల్లోనూ అత‌డి వైఖ‌రి ఆక‌ట్టుకుంటుంది. మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ ఉత్తమ బ్యాట్స్‌మన్‌. వన్డే, టీ20 రికార్డులు అసాధారణమైనవి. అతను టెస్ట్ క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న తీరు అద్భుతం. స‌చిన్‌, కోహ్లీల‌లో ఉన్న సారూప్య‌త ఏంటంటే.. ఈ ఇద్ద‌రూ భారీ సెంచరీలు చేయడానికి ఇష్ట‌ప‌డ‌తారు' అని మైకేల్ క్లార్క్ పేర్కొన్నాడు.

 స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చా:

స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చా:

'నేను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఆసీస్‌ జట్టులోకి వచ్చానని చాలా కొద్ది మందికే తెలుసు. షేన్‌ వార్న్‌ తర్వాత ఆసీస్ జట్టు మేనేజ్‌మెంట్‌ 12, 13 మంది స్పిన్నర్లును ప్రయత్నించింది. అందులో నేనూ ఒకడిని. రెండు టెస్టులు ఆడిన తర్వాత ఆసీస్‌ నుంచి ఉద్వాసనకు గురయ్యా. ఈ సమయంలో స్పిన్నర్‌గా వర్కౌట్‌ కాదని బ్యాటింగ్‌పై ఫోకస్‌ పెట్టాను' అని స్టీవ్‌ స్మిత్‌ చెప్పాడు. ఆసీస్ త‌ర‌ఫు 115 టెస్టులు, 245 వ‌న్డేలు, 34 టీ20లు ఆడిన క్లార్క్‌.. 2015లో కంగారూల‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అందించిన విష‌యం తెలిసిందే.

Story first published: Thursday, April 9, 2020, 10:00 [IST]
Other articles published on Apr 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X