న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కీలక నిర్ణయం: సచిన్ జెర్సీ వివాదానికి ముగింపు పలికిన బీసీసీఐ

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్ అసాంతం ధరించిన జెర్సీ నెంబర్ 10 అనధికారింగా రిటైర్ కానుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది.

By Nageshwara Rao
Sachin Tendulkar’s No. 10 jersey unofficially retired by BCCI

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్ అసాంతం ధరించిన జెర్సీ నెంబర్ 10 అనధికారింగా రిటైర్ కానుంది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది. ఏ క్రికెటర్‌ కూడా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 10వ నంబర్‌ జెర్సీ ధరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

 జెర్సీ నంబర్ 10కి అనధికారికంగా వీడ్కోలు పలుకుదాం

జెర్సీ నంబర్ 10కి అనధికారికంగా వీడ్కోలు పలుకుదాం

'అనవసర వివాదాలకు దారితీస్తు ఆటగాళ్లపై విమర్శలు రావడానికి కారణమవుతున్న జెర్సీ నంబర్ 10కి అనధికారికంగా వీడ్కోలు పలుకుదాం. అయితే ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ఇక మీదట ఎవరూ ఆ జెర్సీ ధరించరు. కానీ ఇండియా-ఏ జట్టు తరఫున, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో మాత్రం పదో నంబర్ జెర్సీతో బరిలో దిగొచ్చు' అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.

 జెర్సీ నెంబర్ 10కి ఓ ప్రత్యేకత

జెర్సీ నెంబర్ 10కి ఓ ప్రత్యేకత

నిజానికి జెర్సీ నెంబర్ 10కి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ క్రీడారంగంలో ఈ నెంబర్‌ ధఱించిన ఆటగాడు అత్యుత్తమ ఆటగాడై ఉంటాడు. క్రికెట్‌లో ఎన్నో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 10వ నెంబర్ జెర్సీనే తన కెరీర్ అసాంతం ధరించాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్‌ రిటైర్మెంట్‌ సందర్భంగా ఆయన క్రికెట్‌కు అందించిన సేవలకుగాను గౌరవపూర్వకంగా తాము 10వ నంబర్‌కు కూడా రిటైర్మెంట్‌ ఇస్తున్నామని తెలిపింది.

As BCCI Retires Jersey No.10, Look What Cricketers Have To Say
 చివరిసారిగా జెర్సీ నెంబర్ 10ని సచిన్ ఎప్పుడు ధరించాడంటే!

చివరిసారిగా జెర్సీ నెంబర్ 10ని సచిన్ ఎప్పుడు ధరించాడంటే!

భవిష్యత్తులో ఏ భారత క్రికెటర్‌ కూడా 10వ నంబర్‌ జెర్సీ ధరించడని అప్పట్లో బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. 2012 మార్చిలో పాకిస్థాన్‌సై చివరి వన్డే ఆడిన మాస్టర్ పదో నంబర్ జెర్సీతోనే ఆ మ్యాచ్‌లో బరిలో దిగాడు. అప్పటి నుంచి దాదాపు ఐదేళ్లపాటు ఆ జెర్సీని ఎవరూ ధరించలేదు. అయితే ఆగష్టులో శ్రీలంక పర్యటనలో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన యువ క్రికెటర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ 10వ నంబర్‌ జెర్సీ ధరించడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

 మాటను నిలబెట్టుకోవడంలో బీసీసీఐ విఫలం

మాటను నిలబెట్టుకోవడంలో బీసీసీఐ విఫలం

ఈ క్రమంలో బీసీసీఐ తన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైందని సచిన్‌ టెండూల్కర్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు బీసీసీఐ, ఠాకుర్‌పై విమర్శలు గుప్పించారు. అయితే, శార్దూల్ ఈ జెర్సీ ధరించడాన్ని గుర్తించిన క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే ఫొటోను షేర్ చేశాడు. సచిన్‌కు తప్ప ఆ జెర్సీని ధరించే అర్హత మరెవరికీ లేదని నెటిజన్లు కామెంట్ చేశారు.

 వెనక్కి తగ్గిన శార్దుల్ ఠాకూర్

వెనక్కి తగ్గిన శార్దుల్ ఠాకూర్

ఆ జెర్సీ కథ ఇక ముగిసిందని, అది దేవుడిదని, వేరెవరికీ దానిని ధరించే అర్హత లేదంటూ ట్విట్టర్‌లో అప్పట్లో పోస్టు చేశారు. ఠాకూర్ ఇకనైనా ఈ జెర్సీని విడిచిపెట్టాలని సచిన్ అభిమానులు కోరారు. దీంతో న్యూమరాలజీ ప్రకారం నాకు పదో నంబర్ కలిసి వస్తుందని, అందుకే ఆ జెర్సీని ధరించానని చెప్పిన శార్దుల్ ఆ తర్వాత వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు కూడా సచిన్‌కు గౌరవ సూచకంగా 10వ నెంబర్‌ జెర్సీకి వీడ్కోలు పలికింది.

Story first published: Wednesday, November 29, 2017, 15:33 [IST]
Other articles published on Nov 29, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X