న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలేం జరిగింది?: 16ఏళ్ల తర్వాత అమ్మకానికి సచిన్‌ బీఎమ్‌డబ్ల్యూ కారు

By Nageshwara Rao
Sachin Tendulkar About To Sale His Car
Sachin Tendulkars blue BMW X5M on sale; heres how you can buy it

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కారుని అమ్మకానికి పెట్టాడు. 2002లో ఎంతో ఇష్టపడి, దగ్గరుండి తనకు కావాల్సినట్లు డిజైన్‌ చేయించుకన్న బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5ఎమ్‌ కారును సచిన్‌ రెండు రోజుల క్రితం అమ్మకానికి పెట్టాడు. ఇప్పటి వరకు ఈ కారు కేవలం 72వేల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది.

వర్షంతో ఆట రద్దు: సచిన్ అసంతృప్తి, గంట మోగించలేకపోయాడువర్షంతో ఆట రద్దు: సచిన్ అసంతృప్తి, గంట మోగించలేకపోయాడు

ఏడు సెకన్లలోపే ఈ కారు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు అత్యధిక వేగం 239 కిలోమీటర్లు. ఈ మోడల్‌ కారుకు ఇప్పట్లో కూడా మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. సుమారు 16 ఏళ్ల తర్వాత సచిన్ ఈ కారును అమ్మాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు.

సచిన్‌ ఈ కారును ఎంత ధరకు అమ్మకానికి పెట్టాడో తెలుసా

సచిన్‌ ఈ కారును ఎంత ధరకు అమ్మకానికి పెట్టాడో తెలుసా

ఇంతకీ సచిన్‌ ఈ కారును ఎంత ధరకు అమ్మకానికి పెట్టాడో తెలుసా.. రూ.21లక్షలు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నార్త్‌వుడ్‌లోని మర్చంట్ టైలర్స్‌వుడ్ పాఠశాలలో టెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్‌అకాడమీ(టీఎంజీఏ)పేరుతో కొత్త అకాడమీని ప్రారంభించాడు.

అకాడమీ పేరు టెండూల్కర్ మిడిలెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ

అకాడమీ పేరు టెండూల్కర్ మిడిలెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ

ఈ అకాడమీ పేరు టెండూల్కర్ మిడిలెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ(టీఎమ్‌జీఏ). ఆగస్టు9 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు సచిన్ క్రికెట్ పాఠాలు చెప్పనున్నాడు. త్వరలోనే ముంబై, లండన్‌లో కూడా ఈ అకాడమీలు ప్రారంభించనున్నారు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా పలు క్యాంపులు కూడా నిర్వహించనున్నారు.

సచినే స్వయంగా క్లాసులు

సచినే స్వయంగా క్లాసులు

ఈ క్రమంలో సచినే స్వయంగా క్లాసులు చెప్పనున్నాడు. అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా మర్చంట్ టైలర్స్‌వుడ్ పాఠశాల విద్యార్థులతో సచిన్ స్వయంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా విద్యార్ధులడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అంతేకాదు, లార్డ్స్‌లో గురువారం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభం కావాల్సిన రెండో టెస్టు మ్యాచ్‌ను సచిన్‌ గంట మోగించి ప్రారంభించాల్సి ఉంది.

 గంట మోగించే అవకాశం కోల్పోయిన సచిన్

గంట మోగించే అవకాశం కోల్పోయిన సచిన్

అయితే, తొలి రోజు వర్షం కారణంగా రద్దవడంపై సచిన్ టెండూల్కర్ గంట మోగించే అవకాశం చేజారింది. దీనిపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో ఏదైనా మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఐదు నిమిషాల పాటు గంట మోగిస్తారు. పర్యాటక జట్టుకు సంబంధించిన వారు ఎవరైనా గంటను మోగించి లాంఛనంగా మ్యాచ్‌ను ప్రారంభించడం ఎప్పటి నుంచో ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

 ఈ అవకాశం రావడం ఇదే తొలిసారి

ఈ అవకాశం రావడం ఇదే తొలిసారి

ఐదు రోజులు జరిగే టెస్టు మ్యాచ్‌ సమయంలోనూ ప్రతి రోజూ ఇలా ఎవరో ఒకరు గంట మోగిస్తారు. తొలి రోజు గంట మోగించి మ్యాచ్‌ను ప్రారంభించాల్సిందిగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌‌ను మైదానం నిర్వాహకులు అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు. సచిన్ టెండూల్కర్‌కు ఈ అవకాశం రావడం ఇదే తొలిసారి. అయితే తొలిరోజు కనీసం టాస్ కూడా పడకుండా ఆట రద్దవడంతో గంట మోగించే అవకాశాన్ని సచిన్ కోల్పోయాడు.

Story first published: Saturday, August 11, 2018, 10:32 [IST]
Other articles published on Aug 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X