మరో ఘనతను దక్కించుకున్న సచిన్ చిత్రం

Posted By:
 Sachin Tendulkar's biopic 'A Billion Dreams' wins award

హైదరాబాద్: సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎ బిలియన్ డ్రీమ్స్'. దీనికి అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే రెండు అవార్డులు రాగా, అవార్డుల ముంగిట మరోసారి కాలర్ ఎగరేసింది. సచిన్ -ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. ది ఎక్లాడ్ గ్లోబల్ ఫిల్మ్ కాంపిటీషన్-2018లో భాగంగా 2017లో వచ్చిన ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమా ఎక్సలెన్స్ అవార్డు దక్కించుకుంది.

ఈ విషయాన్ని బాలీవుడు విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సచిన్ క్రికెట్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంతో తెరకెక్కిన చిత్రానికి జేమ్స్ ఎర్సీన్ దర్శకత్వం వహించగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఐదు భాషలు హిందీ, ఇంగ్లీష్, మరాఠి, తెలుగు, తమిళంలో 2017 మే 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఈ సినిమాకు అవార్డు రావడంతో అభిమానులు సచిన్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇంతకుముందు మరో అవార్డు ఇరాన్‌లోని తెహ్రాన్‌లో జరిగిన అంతర్జాతీయ ఫిక్ట్స్ ఫెస్ట్‌లో ఈ చిత్ర దర్శకుడు హెల్మర్ జేమ్స్‌కు ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కగా..నిర్మాత రవి భాగ్‌చంద్కాకు ఉత్తమ చిత్రం విభాగంలో ప్రత్యేక అవార్డు దక్కింది.

'ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. భారత క్రికెట్ దిగ్గజం జీవిత చరిత్రను చెప్పడంలో నేను పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఈ చిత్రానికి అంతర్జాతీయ వేదికపై ఎన్నో ప్రశంసలు దక్కాయి. మాస్టర్‌కు సంబంధించిన భావోద్వేగాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ చిత్రం ద్వారా చేరడం నాకు ఆనందంగా అనిపించింది. అని ఉత్తమ దర్శకుడి అవార్డు స్వీకరించిన అనంతరం హెల్మర్ జేమ్స్ తెలిపాడు.

Story first published: Sunday, March 11, 2018, 17:18 [IST]
Other articles published on Mar 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి