న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంజలి వస్తే తొలి బంతికే అవుట్.. : సచిన్

Sachin Tendulkar opens up about the real reason why his wife never came to the stadium to watch his match and its surprising!

హైదరాబాద్: కోహ్లీ ఆడుతుంటే అనుష్క, ధోనీ ఆడుతుంటే సాక్షి, ఇంకా శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కోహ్లీ, పుజారా, రవిచంద్రన్‌ అశ్విన్‌, షమి, భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు పలువురి క్రీడాకారుల భార్యలు మైదానంలో గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి రావడం చాలాసార్లు చూశాం. గతేడాది శ్రీలంకతో సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రోహిత్‌ శర్మ సెంచరీలు బాది గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న తన భార్య రితికకు కానుకగా అందించాడు.

 కారణం లేకపోలేదు:

కారణం లేకపోలేదు:

మరి, వీరందరి కంటే సీనియర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సతీమణి మ్యాచ్ చూడడానికి వచ్చినట్లు ఎక్కువ సార్లు కనిపించలేదు. దానికి కారణం లేకపోలేదు అంటున్నాడు సచిన్.

భర్త ఆడుతుంటే గ్యాలరీలో కూర్చుని:

భర్త ఆడుతుంటే గ్యాలరీలో కూర్చుని:

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవ్వరికీ సాధ్యమవ్వని రీతిలో రికార్డుల మీద రికార్డులు సాధించిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ భార్య అంజలి మాత్రం ఎప్పుడూ గ్యాలరీలో కూర్చుని తన భర్త ఆడుతుంటే చూడలేదంట. ఈ విషయాన్ని సచినే స్వయంగా తెలిపాడు.

ఎప్పుడూ మైదానానికి వచ్చి నా గేమ్‌:

ఎప్పుడూ మైదానానికి వచ్చి నా గేమ్‌:

అంజలి ఎప్పుడూ మైదానానికి వచ్చి నా గేమ్‌ చూడలేదు. అలా రాకపోవడానికి కారణం లేకపోలేదు. 2004లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఆడబోయే టెస్టు మ్యాచ్‌ చూసేందుకు మొదటిసారి అంజలి మైదానానికి వచ్చింది. అది బాక్సింగ్‌ డే టెస్టు. బ్రెట్‌ లీ వేసిన మొదటి బంతికి నేను ఔటయ్యాను.

వెంటనే గ్యాలరీలోంచి లేచి వెళ్లిపోయింది:

వెంటనే గ్యాలరీలోంచి లేచి వెళ్లిపోయింది:

వెంటనే గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ తిలకిస్తున్న అంజలి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. ఏదో నమ్మకంతో అంజలి అప్పటి నుంచి ఎప్పుడూ మైదానానికి వచ్చిందే లేదు. ఇంట్లో ఒక చోట కూర్చుని మాత్రమే నేను మ్యాచ్‌లు ఆడుతుంటే చూసేది. ఆ తర్వాత ఆమె మైదానానికి ఎప్పుడు వచ్చిందో తెలుసా?. 2013 నవంబరు 14న. ఎందుకో తెలుసా.. అదే నా చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కాబట్టి' అని సచిన్‌ తెలిపాడు.

Story first published: Tuesday, May 15, 2018, 18:06 [IST]
Other articles published on May 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X