న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్... సచిన్: కామెంటేట‌ర్‌గా క్రికెట్ దేవుడు కొత్త ఇన్నింగ్స్

ICC World Cup 2019: Sachin To Make Commentary Debut In WC Opening Match!! | Oneindia Telugu
Sachin Tendulkar Making His Commentator Debut During England vs South Africa World Cup Opener

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇందుకు ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా జట్ల ఆరంభ మ్యాచ్ వేదికైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ వన్డే వరల్డ్‌కప్‌కు బుధవారం తెరలేచిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ ఓవల్‌ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను ప్రసారం చేస్తోన్న స్టార్‌ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్‌లో "Sachin Opens Again" త్వరలో ప్ర‌సారం కానుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌కు స‌చిన్ టెండూల్కర్ కామెంటేటర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్‌కి లండన్‌లోని ఓవల్ మైదానం ఆతిథ్యమిస్తోంది. ఆరంభ మ్యాచ్‌కి ముందు స్టార్ స్పోర్ట్స్‌లో వచ్చే ప్రీషోలో స‌చిన్ ఈ మ్యాచ్‌పై విశ్లేష‌ణ ఇవ్వ‌నున్నారు.

మ‌ధ్యాహ్నం 1.30 గంటలకు ఈ షో ప్రారంభం కానుంది. ఈ షో హిందీ, ఇంగ్లీష్‌లో ఉండనుంది. ఈ షోలో సచిన్ టెండూల్కర్‌తో పాటు మాజీ క్రికెటర్లు సైతం పాల్గొంటారు. కాగా, ఆరు సార్లు వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడిన సచిన్ టెండూల్కర్ 2278 పరుగులు చేశాడు. 2003లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు చేశాడు.

అన్ని ఫార్మాట్లు కలిపి 30వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కరే కావడం విశేషం. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్‌ కూడా సచినే. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ మెగా టోర్నీలో భాగంగా టీమిండియా తన ఆరంభ మ్యాచ్‌ని జూన్ 5న సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Story first published: Thursday, May 30, 2019, 13:22 [IST]
Other articles published on May 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X