న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మ్యాచ్‌ పూర్తిగా జరిగి ఉంటే బహుశా మేము గెలిచే వాళ్లం'

IND V WI 2019,2nd T20I : Rovman Powell Says 'If The Game Had Finished,We Probably Would Have Won'
India vs West Indies 2019: If the game had finished, we probably would have won says Rovman Powell

లాడర్‌హిల్‌: క్రీజ్‌లో కీరన్‌ పొలార్డ్‌, హెట్‌మయిర్‌ ఉన్నారు. మ్యాచ్‌ పూర్తిగా జరిగి ఉంటే.. బహుశా మేము గెలిచే వాళ్లమని వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రోమన్‌ పావెల్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 22 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది.

<strong>విండీస్‌తో ఆఖరి టీ20: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను.. జట్టులో మార్పులు</strong>విండీస్‌తో ఆఖరి టీ20: క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను.. జట్టులో మార్పులు

మ్యాచ్ అనంతరం రోమన్‌ పావెల్‌ మాట్లాడుతూ... 'పిచ్‌ బాగుంది. బంతి బ్యాట్‌ మీదికి వస్తుంది. తొలి టీ20తో పోల్చుకుంటే.. రెండో మ్యాచ్‌లో పిచ్‌ స్పిన్‌కు అనుకూలించలేదు. వర్షం వచ్చే సమయంలో హిట్టర్లు క్రీజులో ఉన్నారు. ఒకవేళ మ్యాచ్‌ పూర్తిగా జరిగి ఉంటే.. బహుశా మేము గెలిచే వాళ్లం. కనీసం విజయానికి చాలా దగ్గరిగా వచ్చేవాళ్లం' అని పావెల్‌ అన్నాడు.

'మాకు చేతిలో తగినంత వికెట్లు ఉన్నాయి. క్రీజ్‌లో కీరన్‌ పొలార్డ్‌, హెట్‌మయిర్‌ ఉన్నారు. కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, కీమో పాల్‌లు కూడా బ్యాట్ జులిపించగలరు. టీమిండియా విజయం సాధించినా.. మేము తప్పకుండా గట్టిపోటీ ఇచ్చే వాళ్లం. మూడవ మ్యాచుకు జట్టులో మార్పులు ఉంటాయని అనుకుంటున్నా. ఏదేమైనా గయానాలో జరిగే మూడో టీ20లో విజయం సాధించడం కోసం ప్రయత్నిస్తాం. టీమిండియాను ఓడించగలమని భావిస్తున్నా' అని పావెల్‌ చెప్పుకొచ్చాడు.

<strong>గుండె పోటుతో భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ మృతి</strong>గుండె పోటుతో భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌ మృతి

రెండో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్‌ శర్మ (67) అర్ధ శతకంతో రాణించాడు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 15.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఈ సమయంలో పిడుగులతో కూడిన వర్షం పడటంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. పావెల్‌ (54) అర్ధ శతకం చేసాడు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 22 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.

Story first published: Tuesday, August 6, 2019, 10:54 [IST]
Other articles published on Aug 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X