ముంబైకే ఈ టోర్నీ ముఖ్యం, వేడుకలను ప్రారంభించిన సచిన్

Posted By:
Sachin Tendulkar Heaps Praise on India U-19 Captain Prithvi Shaw

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్ 19 జట్టులో పృథ్వీ షా ప్రదర్శన ఆకట్టుకుందని సచిన్ అభిప్రాయపడ్డారు. టీ 20 క్రికెట్ ముంబై లీగ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న ఆయన శనివారం హాజరై మాట్లాడారు. పృథ్వీ షా ఆటతీరు ప్రతి మ్యాచ్‌లోనూ పరిణతి చెందుతుందని కొనియాడారు. ఇదే విధంగా ముంబై టీ 20లీగ్ రోజూ తను మరింత మెరుగుపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

అండర్ 19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పృథ్వీ షా ముంబై టీ 20లీగ్‌లో ముంబై పాంథర్స్ తరపున ఆడుతున్నాడు. అజింకా రహానె నేతృత్వంలో కొనసాగుతున్న ఈ జట్టుతో పాటుగా మరో ఐదు జట్లు ఆదివారం నుంచి మొదలుకాబోతున్న ఈ టోర్నమెంట్‌లో భాగంకానున్నాయి.

సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. ప్రతి క్రికెటర్ తన ప్రతిభను చూపించుకునేందుకు మంచి వేదిక కోసం ఆరాటపడుతుంటారని తెలిపాడు. ఈ ముంబై టీ20 లీగ్ సరిగ్గా అలాంటి వాళ్ల కోసం సదవకాశం అని పేర్కొన్నారు. ముంబై క్రికెట్ అంతటికీ ఈ లీగ్ చాలా ముఖ్యమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌కు శ్రీలంక పర్యటన నేపథ్యంలో చాలా మంది యువ ఆటగాళ్లు దూరమయ్యారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న ఈ టోర్నీకి మాజీ దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్ లీగ్ కమిషనర్ గా, దిలీప్ వెంగ్‌సర్కార్‌, సందీప్‌పాటిల్‌, వినోద్‌ కాంబ్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్‌లన్నీ ముంబై వాంఖెడే స్టేడియంలో జరుగనున్నాయి.

Story first published: Sunday, March 11, 2018, 13:51 [IST]
Other articles published on Mar 11, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి