న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రికార్డును తిరుగారాశాను: బార్బర్‌షాప్ గర్ల్స్‌తో గడ్డం గీయించుకున్న సచిన్

Sachin Tendulkar gets a shave from a woman, says its a first for him

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్‌లో ఎన్ని రికార్డులు అయితే అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు తనదైన ఆటతీరుతో కోట్లాది మందిని అలరించాడు. తాజాగా, బార్బర్‌షాప్ గర్ల్స్‌గా ప్రాచుర్యంలో నిలిచిన నేహా, జ్యోతి అనే అమ్మాయిలతో సచిన్ శనివారం గడ్డం తీయించుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అంతేకాదు వారి ఆర్థిక అవసరాల కోసం స్కాలర్‌షిప్‌ కూడా అందజేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బన్వారితొల గ్రామానికి చెందిన నేహా, జ్యోతి క్లిష్టమైన పరిస్థితుల్లో క్షవర వృత్తిని ఎంచుకున్నారు. ఐదేళ్ల క్రితం తండ్రి అనారోగ్యం పాలుకావడంతో కుటుంబభారాన్ని మోసేందుకు వీరిద్దరూ సిద్ధమయ్యారు. తమ నాన్న నడిపిన సెలూన్ షాప్‌లోనే ఇద్దరు కలిసి కటింగ్, షేవింగ్ చేయడం ప్రారంభించారు.

అమ్మాయిలు కావడంతో వీరిద్దరూ కటింగ్, షేవింగ్ ఏం చేస్తారని భావించిన కొందరు షాప్‌కు మానేశారు. దీంతో అబ్బాయిల్లాగా తయారై తమ వృత్తిని కొనసాగించారు. వీరి గురించి తెలుసుకున్న ఓ ప్రముఖ కంపెనీ రూపొందించిన వాణిజ్య ప్రకటనను యూట్యూబ్‌లో ఏకంగా 16మిలియన్ల మంది వీక్షించారు.

ఈ వార్తను తెలుసుకున్న సచిన్‌ వాళ్లిద్దరితో షేవింగ్‌ చేయించుకొని 'జిల్లెట్‌' సంస్థ ద్వారా స్కాలర్‌షిప్‌ ఇప్పించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను క్రికెట్‌ దిగ్గజం తన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ అకౌంట్స్‌లో పోస్ట్‌ చేస్తూ "మీకు తెలుసో లేదో, నేను ఇప్పటి వరకు ఎవరితో గడ్డం గీయించుకోలేదు. కానీ ఈ రోజు ఆ రికార్డును తిరుగారాశాను" అని అంటూ సచిన్ కామెంట్ పెట్టాడు.

Story first published: Sunday, May 5, 2019, 14:33 [IST]
Other articles published on May 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X