న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India VS South Africa: మొద‌టి 25 ఓవ‌ర్లు జాగ్ర‌త్త‌.. టీమిండియా బ్యాట‌ర్ల‌కు స‌చిన్ టిప్స్‌

Sachin Tendulkar batting tips for Indian batsmen
Front Foot Defence.. Sachin's Strong Advice To Teamindia | Sa Vs Ind | Oneindia Telugu

సౌతాఫ్రికా, భార‌త్‌ టెస్ట్ సిరీస్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆట‌గాళ్లు ప్రాక్టీస్‌లో బిజీగా ఉంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సౌతాఫ్రికాలో ఒక్క సారి కూడా టెస్టు సిరీస్‌ గెల‌వ‌ని భార‌త్ ఈ సారి ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలో టీమిండియా బ్యాట‌ర్ల‌కు క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కొన్ని సూచ‌న‌లు చేశాడు. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై రాణించాలంటే ఎలా బ్యాటింగ్ చేయాలో కొన్ని టిప్స్ చెప్పాడు. సౌతాఫ్రికాలోని బౌన్సీ పిచ్‌ల‌పై దూసుకొచ్చే బంతుల‌ను ఎలా ఆడాలో చెప్పాడు.

ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ముఖ్యం

ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ముఖ్యం

స‌చిన్ ప్ర‌ధానంగా ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ గురించే చెప్పాడు. బ్యాటింగ్ చేసేట‌ప్పుడు బ్యాట‌ర్లు త‌మ చేతులు శ‌రీరానికి దూరంగా వెళ్ల‌కుండా చూసుకోవాల‌ని తెలిపాడు. ఒక వేళ చేతులు శ‌రీరానికి దూరంగా వెళ్తే బ్యాట‌ర్లు క్ర‌మంగా క్రీజులో నియంత్ర‌ణ కోల్పోతార‌ని హిత‌బోధ చేశాడు. ఆ స‌మ‌యంలో బంతులు మీ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి వెనక్కి క్యాచ్‌గా వెళ్లిపోతాయ‌ని హెచ్చ‌రించాడు.

అంతేకాకుండా మొద‌టి 25 ఓవ‌ర్లు ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చాలా కీలకమ‌ని, ఓపిక‌తో బ్యాటింగ్ చేయాల‌ని స‌చిన్ సూచించాడు. తాను చెప్పినట్లు ఆడితే, కొన్ని బంతులు మిస్ కావచ్చు కానీ, ప్రతి బ్యాట‌ర్‌కు కొన్ని బంతులు బీట్ అవుతాయనే విషయం గ్రహించాల‌న‌నాడు. బౌలర్లు ఉన్నదే అలా బీట్ చేసి, వికెట్లు తీయడానిక‌ని స‌చిన్‌ హెచ్చ‌రించాడు.

రోహిత్‌, రాహుల్ అలాగే స‌క్సెస్‌

రోహిత్‌, రాహుల్ అలాగే స‌క్సెస్‌

ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ స‌రిగ్గా పాటించి ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, లోకేష్ రాహుల్ స‌క్సెస్ అయ్యార‌ని స‌చిన్ గుర్తు చేశాడు. వారిద్ద‌రు చేతుల‌ను శ‌రీరానికి దూరంగా వెళ్ల‌నీయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డార‌ని అన్నాడు. కాగా ఏడాది జ‌రిగిన‌ ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, లోకేష్ రాహుల్ చెల‌రేగారు.

ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 52 స‌గటుతో 368 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచ‌రీలు, ఒక సెంచ‌రీ ఉన్నాయి. ఇక లోకేష్ రాహుల్ 39 సగ‌టుతో 315 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక సెంచ‌రీ, ఒక హాఫ్ సెంచ‌రీ ఉన్నాయి.

సౌతాఫ్రికాలో సచిన్ స‌క్సెస్‌

సౌతాఫ్రికాలో సచిన్ స‌క్సెస్‌

సౌతాఫ్రికా గ‌డ్డ‌పై విజ‌యంత‌మైన బ్యాట‌ర్‌గా భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ నిలిచాడు. అక్క‌డ 15 టెస్టుల‌కుగాను 28 ఇన్నింగ్స్‌లో స‌చిన్ 46 స‌గ‌టుతో 1,161 ప‌రుగులు చేశాడు. అంతేకాకుండా సౌతాఫ్రికాలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్‌గా స‌చిన్ ఉన్నాడు.

Story first published: Wednesday, December 22, 2021, 12:05 [IST]
Other articles published on Dec 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X