న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణం: సచిన్

Sachin Tendulkar and Vinod Kambli remember their coach Ramakant Achrekar on Guru Purnima

ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణం అని భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన గురువును గుర్తు చేసుకున్నారు. బుధవారం గురుపూర్ణిమ సందర్భంగా తనను క్రికెటర్‌గా తీర్చిదిద్దిన గురువు రమాకాంత్ అచ్రేకర్‌కు సచిన్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సచిన్ తన గురువును స్మరించుకున్నాడు.

ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం:

'విద్యార్థిలోని చీకటి అజ్ఞానాన్ని గురువు మాత్రమే తొలగించగలడు. గురువుగా నన్ను ముందుకు నడిపించి, నాకు మార్గదర్శిగా ఉంటూ ఈ స్థాయిలో ఉండేలా చేసిన మా గురువు అచ్రేకర్ సర్‌కు ధన్యవాదాలు' అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. ఇప్పుడే కాదు సమయం వచ్చినప్పుడల్లా అచ్రేకర్ చేసిన కృషిని సచిన్ చెప్పుకొచ్చారు. రమాకాంత్ విట్టల్ అచ్రేకర్ ఈ ఏడాది జనవరి 2న కన్నుమూశారు.

ఎంతో మిస్ అవుతున్నా:

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా ట్విట్టర్ వేదికగా అచ్రేకర్‌కు నివాళులర్పించారు. 'ఓ ఉత్తమ క్రికెటర్‌గానే కాకుండా మంచి మనిషిగా ఎలా ఉండాలో నాకు నేర్పించారు. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నా అచ్రేకర్ సర్‌. మీ శిక్షణ ద్వారా ఎప్పుడూ మీరు నాతో ఉంటారు. గురుపూర్ణిమ శుభాకాంక్షలు' అని కాంబ్లీ పేర్కొన్నారు. సచిన్, కాంబ్లీతో పాటు ఎంతో మందిని క్రికెటర్లుగా అచ్రేకర్ తీర్చిదిద్దారు.

మరో సూపర్ ఓవర్ పెట్టాల్సింది:

మరో సూపర్ ఓవర్ పెట్టాల్సింది:

తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ విజయంపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉన్న విషయం తెలిసిందే. మాజీలు అందరూ మరో సూపర్ ఓవర్ పెట్టాలని అబిప్రాయపడుతుండగా.. సచిన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మరో సూపర్ ఓవర్ పెట్టాల్సింది. ఇరు జట్ల బౌండరీల సంఖ్యను కాకుండా సూపర్ ఓవర్ పెడితే సరైన ఫలితం వచ్చేది. ఇది ప్రపంచకప్ ఫైనల్‌కు మాత్రమే కాదు ప్రతి మ్యాచ్‌కు ఇలానే ఉండాలి. ఫుట్‌బాల్‌లోనూ నిర్ణీత సమయంలో ఇరు జట్లు సమాన గోల్స్ చేస్తే.. అదనపు సమయం కేటాయిస్తారు. క్రికెట్ కూడా అంతే' అని సచిన్ అన్నారు.

Story first published: Wednesday, July 17, 2019, 11:19 [IST]
Other articles published on Jul 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X