న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: అటు ఇంగ్లండ్‌.. ఇటు ఆస్ట్రేలియా! ఫైనల్ చేరాలంటే రోహిత్ సేన ఏం చేయాలంటే..?

Saba Karim explains India’s challenges to make it to the WTC final

న్యూఢిల్లీ: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫస్ట్ ఎడిషన్‌లో ఫైనల్ చేరిన టీమిండియా.. తృటిలో విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో అద్భుత విజయాలు అందుకొని ఫైనల్ చేరిన భారత జట్టు.. ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తుది పోరులో ఓటమిపాలైంది. ఇక తాజా డబ్ల్యూటీసీ 2021-23 ఎడిషన్‌లో టీమిండియా ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నూతన సారథి రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండి ఫైనల్ చేరాలంటే ఈ సీజన్‌లో మిగిలి ఉన్న ఏడు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరచడంతో పాటు మిగతా జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమి భారత జట్టు అవకాశాలను సంక్లిష్టం చేసింది.

 ఐదు మ్యాచ్‌లు గెలవాలి..

ఐదు మ్యాచ్‌లు గెలవాలి..

ఇప్పటి వరకు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో జరిగిన సిరీస్‌ల్లో 6 విజయాలు, 2 డ్రా చేసుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక 2021-23 షెడ్యూల్‌లో భాగంగా ఇంకా ఇంగ్లండ్‌లో ఒక టెస్టు, బంగ్లాదేశ్‌లో రెండు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు టీమిండియా ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్‌ సబా కరీం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సీజన్‌లో ఆడనున్న ఏడింటిలో ఫైనల్ చేరాలంటే కచ్చితంగా ఐదింటిలో రోహిత్‌ సేన గెలవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

పాక్‌తో సిరీస్ కలిసొస్తుంది..

పాక్‌తో సిరీస్ కలిసొస్తుంది..

'ఇంగ్లండ్‌లో జరిగే టెస్ట్.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో నాలుగు టెస్టులు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియాకు సవాళ్లు ఎదురవడం ఖాయం. ఆస్ట్రేలియా బలమైన జట్టు. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ ఆడటం వాళ్లకు కలిసొస్తుంది. ఉపఖండ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోవడానికి టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్‌ పర్యటన వారికి మేలు చేస్తుంది. వాళ్లకు నాథన్‌ లియాన్‌, స్వెప్సన్‌ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ మినహా మిగతావన్నీ ఉపఖండంలోనే ఆడటం భారత్‌కు కలిసి వచ్చే అంశం'అని సబాకరీం చెప్పుకొచ్చాడు.అద్భుతమైన ఆటతీరు మంచి ఫలితాలు రాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలని ఆకాంక్షించారు.

 టాప్‌లో ఆసీస్..

టాప్‌లో ఆసీస్..

కాగా ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో 4-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్‌ పర్యటన నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండింటిని డ్రా చేసుకుంది. ఇక ఇంగ్లండ్‌ అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ స్వదేశంలో జరిగే మ్యాచ్‌లో టీమిండియాకు సవాల్‌ విసిరే అవకాశం ఉంది. మూడో స్థానంలో సౌతాఫ్రికా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఆ జట్టు ఆట కూడా ఎంతో మెరుగైంది.

Story first published: Thursday, March 17, 2022, 20:55 [IST]
Other articles published on Mar 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X