న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో చెన్నై జట్టును ఎందుకు అసహ్యించుకుంటాడో కారణం చెప్పిన శ్రీశాంత్!!

S Sreesanth reveals why he hates IPL franchise Chennai Super Kings

ఢిల్లీ: ఐపీఎల్‌ ప్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుపై తనకెందుకంత కోపమో, ఇంతకు ఎందుకు ఆ జట్టును అసహ్యించుకుంటాడో భారత పేసర్‌ ఎస్. శ్రీశాంత్‌ చెప్పాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌ పాడీ ఆప్టన్‌ ఇటీవల విడుదల చేసిన ఆటోబయోగ్రఫీలో చెన్నై జట్టుపై శ్రీశాంత్‌ని ఆడించకపోవడం వల్లే.. తనను అసభ్యంగా దూషించాడని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

<strong>భద్రతాపరమైన ముప్పు ఉంటే పాకిస్తాన్‌కు వచ్చేవాడిని కాదు: మైఖేల్ హోల్డింగ్</strong>భద్రతాపరమైన ముప్పు ఉంటే పాకిస్తాన్‌కు వచ్చేవాడిని కాదు: మైఖేల్ హోల్డింగ్

ఎప్పుడైనా దూషించానా?:

ఎప్పుడైనా దూషించానా?:

శ్రీశాంత్ మాట్లాడుతూ... 'ఆప్టన్‌.. మీ మనసు, పిల్లలపై చేతులు పెట్టి చెప్పండి. టీంఇండియాలో లేదా ఐపీఎల్‌లో ఎప్పుడైనా మిమ్మల్ని దూషించానా?. దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. నేనెప్పుడైనా అతడితో గొడవపడ్డానా?. ఆప్టన్‌ తన పుస్తకంలో రాసినట్లు దూషించానా?' అని శ్రీశాంత్‌ ప్రశ్నించాడు. చెన్నై జట్టుపై మ్యాచ్ ఆడతానని చాలాసార్లు ఆప్టన్‌ను కోరా. అది కూడా ఆ జట్టుపై నాకు మంచి రికార్డు ఉన్న కారణంగానే అడిగా. కానీ.. ఆప్టన్‌ మరోలా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు' అని శ్రీశాంత్‌ తెలిపాడు.

 పసుపు రంగు అంటే నచ్చదు:

పసుపు రంగు అంటే నచ్చదు:

'చెన్నై జట్టును ఎంత అసహ్యించుకుంటానో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ, జట్టు యజమాని ఎన్‌ శ్రీనివాసన్ వల్లే తాను చెన్నై జట్టుపై కోపంతో ఉన్నానని అందరూ అనుకుంటారు. కానీ.. ఇక్కడ విషయం వేరు. నాకు పసుపు రంగు అంటే నచ్చదు. చెన్నై ఎల్లో జెర్సీనే ధరిస్తుంది కాబట్టి అసహ్యించుకుంటా. ఆస్ట్రేలియా జట్టుని కూడా అసహ్యించుకుంటా' అని శ్రీశాంత్‌ అన్నాడు.

 ఆరోపణలు నిరాశకు గురిచేశాయి:

ఆరోపణలు నిరాశకు గురిచేశాయి:

'నాకు చెన్నైపై మంచి రికార్డు ఉంది. అందుకే నేను మ్యాచ్ ఆడాలనుకున్నా. అప్టన్‌ను నేను దూషించాననే ఆరోపణలు నిరాశకు గురిచేశాయి. అది పోలీసుల టార్చర్‌ కన్నా ఎక్కువగా అనిపించింది. ఇప్పటికీ కూడా ఆ విషయం నన్ను బాధిస్తోంది. వేరే ఆటగాళ్లు ఆప్టన్‌ గురించి మాట్లాడుతూ.. ఇతనెవరు అసలు? మొత్తం చేసేదంతా గ్యారీ కిరస్టెన్‌ అని అంటారు. నేనెప్పుడైనా అతడితో ఇలా ప్రవర్తించానా? అని శ్రీశాంత్‌ చెప్పుకొచ్చాడు.

అస్సలు నిద్ర పట్టేది కాదు:

అస్సలు నిద్ర పట్టేది కాదు:

'థిహార్‌ జైల్లో ఖైదీగా ఉన్నప్పుడు అక్కడున్న పోలీసు సిబ్బంది హత్య చేసి వచ్చిన నేరస్తుడిగా చూశారు. నోటికి వచ్చినట్లు మాటలతో వేధించేవారు. ఆ సమయంలో నేను చాలా భయానికి గురయ్యా. కానీ త్వరగానే తేరుకున్నా. జైల్లో అస్సలు నిద్ర పట్టేది కాదు. లైట్స్‌ ఆర్పలేకపోయేవారు. జైల్లో చాలా విధాలుగా మానసికంగా కృంగిపోయా' అని శ్రీశాంత్‌ తెలిపాడు.

Story first published: Monday, September 30, 2019, 15:03 [IST]
Other articles published on Sep 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X