న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL Qualifier 2: మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ మిస్ చేసిన రియాన్ పరాగ్.. నెట్టింటా పరాగ్ మీద చెండాలమైన ట్రోల్స్

Ryan Parag misses Rajat Patidar catch, netizens raise trolls on Parag again

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఆట కంటే ఓవర్ ఆటిట్యూడ్‌తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటాడు. ఇటీవల క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో బ్యాటింగ్లో అశ్విన్‌తో చిన్నపాటి గొడవ, అలాగే ఫీల్డింగ్లో తోటి ప్లేయర్ దేవదత్ పడిక్కల్‌ మీద సీరియస్ అవ్వడం లాంటి వాటితో రియాన్ పరాగ్ వార్తల్లో నిలిచాడు. అంతకుముందు రియాన్ పరాగ్ బెంగళూరు ప్లేయర్ హర్షల్ పటేల్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రియాన్ పరాగ్ ఆటిట్యూడ్ పట్ల సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. అతన్ని రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు.

తాజాగా క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో కూడా రియాన్ పరాగ్ ఓ పెద్ద మిస్టేక్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రమాదకర రజత్ పటీదార్ క్యాచ్ మిస్ చేశాడు. గత మ్యాచ్‌లో రజత్ పటీదార్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. రజత్ పటీదార్ వికెట్ చాలా కీలకంగా మారిన తరుణంలో పరాగ్ క్యాచ్ మిస్ చేయడంతో నెట్టింటా మరోసారి రియాన్ పరాగ్ మీద ట్రోల్స్ తో నెటిజన్లు బెంబేలెత్తిస్తున్నారు.

అసలేలా క్యాచ్ మిస్సయిందంటే?

ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా కోహ్లీ, డుప్లెసిస్ బరిలో దిగగా.. కోహ్లీ (7) రెండో ఓవర్లో ప్రసీద్ క్రిష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్.. డుప్లెసిస్‌తో కలిసి మ్యాచ్ ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకున్నాడు. వచ్చీ రాగాన 4వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టి టచ్ లోకి వచ్చిన పటీదార్.. 6వ ఓవర్లో ప్రసీద్ క్రిష్ణ బౌలింగ్ వేయగా.. ఆ ఓవర్ 3, 4బంతుల్లో వరుసగా ఫోర్లు బాదాడు. ఇక మూడో బంతికి ప్రసీద్ లెంత్ బాల్ వేయగా పటీదార్ ఆడిన షాట్ కు బంతి గల్లీలో ఉన్న రియాన్ పరాగ్ కు కాస్త మీదుగా వెళ్లింది. ఇక ఆ బంతిని రియాన్ పరాగ్ కాస్త ఎగిరి అందుకునే వీలుంది. అయితే పరాగ్ కాస్త ఎగిరినప్పటికీ లూజ్‌గా చేతులు పెట్టడంతో క్యాచ్ మిస్సయింది. దీంతో పటీదార్ బతికి బయటపడ్డాడు. అప్పటికి పటీదార్ స్కోరు (13పరుగులు 13బంతుల్లో) ఇక ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రజత్ పటీదార్.. మరోసారి తన మార్క్ షాట్లతో రాజస్థాన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఆడుతున్నాడు. 14ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3వికెట్లు కోల్పోయి 111పరుగులు చేయగా.. పటీదార్ (44పరుగులు 36బంతుల్లో 4ఫోర్లు 1సిక్సర్ నాటౌట్) ఆడుతున్నాడు.

కర్మ అనుభవిస్తున్నావ్ పరాగ్

ఇక ఈ క్యాచ్ మిస్ చేయడంతో రియాన్ పరాగ్ మీద నెటిజన్లు తమ అసహనాన్ని ట్వీట్లు, మీమ్స్, పోస్టుల రూపంలో చూపిస్తున్నారు. అరె చెత్తగా.. అనే రేంజులో రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ ను తిడుతున్నట్లు నెటిజన్లు ఓ మీమ్ చేశారు. అలాగే ఇంకొందరు నువ్వేదే తోపు ఫీల్డర్ లాగా మొన్న మ్యాచ్‌లో అరిచినావ్ కదా.. ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నావ్ అంటూ పరాగ్ ను మరికొందరు ఆడుకున్నారు. పెద్ద విరాట్ కోహ్లీలా ఫీలయిపోతావ్‌గా ఇప్పుడేమైందో చూడు అంటూ ఇంకొందరు మండిపడ్డారు. ఇక చాలా మంది రియాన్ పరాగ్ చెత్త ఫీల్డింగ్ వల్ల మ్యాచ్ స్వరూపమే మారిపోతుందంటూ జోస్యం చెబుతున్నారు. ఎందుకంటే పరాగ్ మిస్ చేసింది అత్యంత ప్రమాదకరమైన రజత్ పటీదార్ క్యాచ్ కావడం వల్లే.

తుది జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీపర్, కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Friday, May 27, 2022, 20:58 [IST]
Other articles published on May 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X