న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs CSK: అరంగేట్ర మ్యాచ్‌లోనే గోల్డెన్‌ డక్‌ అయిన చెన్నై బ్యాట్స్‌మన్‌!!

Ruturaj Gaikwad goes for a duck his IPL debut match

షార్జా: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే తడబడుతోంది. అయితే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రుతురాజ్‌ గైక్వాడ్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. రాయల్స్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ ఆడిన తొలి బంతికే పెవిలియన్‌ చేరాడు. రాజస్తాన్‌ స్పిన్నర్‌ తెవాతియా బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన గైక్వాడ్‌ స్టంపౌట్‌ అయ్యాడు. ఫలితంగా అరంగేట్రం ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో గోల్డెన్‌ డక్‌గా అవుటైన జాబితాలో చేరిపోయాడు.

తొమ్మిదో ఓవర్‌ ఐదో బంతికి చెన్నై ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ స్టంపౌట్‌ అవ్వగా.. ఆ తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్ క్రీజులోకి వచ్చాడు. ఆడిన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. కరన్‌ తరహాలో గైక్వాడ్ నిష్క్రమించాడు. ఫలితంగా అరంగేట్రం ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో గోల్డెన్‌ డక్‌గా రికార్డులోకి ఎక్కాడు. దాంతో సీఎస్‌కే 77 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు మురళీ విజయ్ ‌(21),షేన్‌ వాట్సన్‌ (33)లు ఔటయ్యారు.

రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో చేనై ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. విజయ్‌-వాట్సన్‌లు దూకుడుగా ఆడారు. వాట్సన్‌ నాలుగు సిక్స్‌లు బాదాడు. మరోవైపు విజయ్‌ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. అయితే స్పిన్నర్ గోపాల్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి బోల్ట్ అయ్యాడు. దీంతో 56 పరుగుల భాగస్వామ్యంకు తెరపడింది. కాసేపటికి విజయ్‌ ఔటయ్యాడు. ఆపై సామ్‌ కరన్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మంచి ఊపుమీద కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేదు. ఇక గైక్వాడ్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాట్స్‌మన్‌ యశస్వి జైశ్వాల్ ‌(6) మూడో ఓవర్‌లోనే దీపక్ చహర్‌ చేతికి చిక్కగా.. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సంజూ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సుల వర్షం కురిపించాడు. స్మిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే సెంచరీ వైపు వెళ్తున్న సంజూని ఎంగిడీ ఔట్‌ చేశాడు. భారీ సిక్సర్‌ కొట్టబోయి చహర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత రాజస్థాన్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. స్మిత్‌కు సహకరించే బ్యాట్స్‌మన్‌ కరవయ్యారు. ఆఖరికి అతడు కూడా 69 పరుగుల చేశాక సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో కేదార్‌ జాదవ్‌కు చిక్కాడు. చివర్లో ఆర్చర్‌ మళ్లీ నాలుగు సిక్సులు బాదడంతో చెన్నై ముందు రాజస్థాన్‌ భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Story first published: Wednesday, September 23, 2020, 8:24 [IST]
Other articles published on Sep 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X