న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs KXIP: ఒకే ఓవర్లో ఐదు సిక్సులు.. ఎవరీ రాహుల్ తెవాటియా.. ఆసక్తికర విషయాలు ఇవే!!

RR vs KXIP: Rahul Tewatia made his IPL debut for Rajasthan Royals as early as 2014

హైదరాబాద్: ఆదివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్‌ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టోర్నీ చరిత్రలోనే రాజస్థాన్ అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నెలకొల్పింది. యువ ఆటగాడు సంజూ శాంసన్‌ (85; 42 బంతుల్లో 4x4, 7x6), కెప్టెన్ స్టీవ్‌ స్మిత్ ‌(50; 27 బంతుల్లో 7x4, 2x6), రాహుల్‌ తెవాటియా (53; 31 బంతుల్లో 7x6) విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తెవాటియా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.

ఒకే ఓవర్లో ఐదు సిక్సులు

ఒకే ఓవర్లో ఐదు సిక్సులు

స్టీవ్ స్మిత్ అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్‌ తెవాటియా తొలుత పరుగులు చేసేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేశాడు. ఇక సెంచరీకి చేరువైన సంజూ భారీ షాట్‌ ఆడి ఔటయ్యాడు. దీంతో పంజాబ్‌ గెలుపు ఖాయమని అంతా భావించారు. రాజస్థాన్‌ విజయానికి 3 ఓవర్లలో 51 పరుగులు చేయాల్సిన స్థితిలో తెవాటియా అనూహ్యంగా చెలరేగిపోయాడు. అప్పటి వరకు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన తెవాటియా.. షెల్డన్‌ కాట్రెల్‌ వేసిన 18వ ఓవర్‌లో మొత్తం 5 సిక్సులు బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. రాయల్స్‌ సునాయాస విజయాన్ని అందుకుంది. ఓసారి తెవాటియా ఐపీఎల్ జర్నీని చూద్దాం.

2014లోనే ఐపీఎల్‌కి అరంగేట్రం

2014లోనే ఐపీఎల్‌కి అరంగేట్రం

27 ఏళ్ల రాహుల్ తెవాటియా 1993లో హర్యానాలోని సిహి గ్రామంలో జన్మించాడు. ఆటపై మక్కువతో చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆడేవాడు. 2013లో తెవాటియా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. కానీ తన రాష్ట్ర జట్టుతో ఎక్కువగా మ్యాచులు ఆడలేదు. ఫస్ట్ క్లాస్ స్థాయిలో 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇక 21 లిస్ట్-ఎ మ్యాచులు ఆడి 100కు పైగా స్ట్రైక్ రేట్‌తో 484 పరుగులు చేశాడు. 27 వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 2014లో రాజస్థాన్ రాయల్స్ తెవాటియాను వేలంలో(10 లక్ష్యలు) దక్కించుకుంది. ఆ సీజన్లో కేవలం 3 మ్యాచ్‌లు ఆడి.. 16 పరుగులు, 3 వికెట్లు తీశాడు. ఇక 2015లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు.

రూ .3 కోట్లకు కొనుగోలు

రూ .3 కోట్లకు కొనుగోలు

2016 ఐపీఎల్ సీజన్లో రాహుల్ తెవాటియా ఆడలేదు. 2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన తెవాటియా.. అంతగా ఆకట్టుకోలేదు. కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 19 పరుగులు, 3 వికెట్లు తీశాడు. 2018లో తెవాటియాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ .3 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ హర్యానా ఆల్ రౌండర్ కోసం పోటీపడ్డాయి. 2018లో తెవాటియా 8 మ్యాచ్‌లు ఆడి.. కేవలం 50 పరుగులు చేసి 6 వికెట్లు తీశాడు. 2019లో మరో 5 మ్యాచ్‌లు ఆడినా ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్ 2020 కోసం రాయల్స్ జట్టుకు ట్రేడింగ్ విధానంలో తెవాటియా వచ్చాడు. ఇప్పడు వెలుగులోకి వచ్చాడు.

రాత్రికి రాత్రే పెద్ద స్టార్

రాత్రికి రాత్రే పెద్ద స్టార్

ఆదివారం వరకు రాహుల్ తెవాటియా పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ జట్టుతో జరిగిన ఒక్క ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయ్యాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సులు బాదడంతో తెవాటియా తన పేరును ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తెవాటియా మంచి బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు.. అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ కూడా. పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ అతనికి 50వ టీ20 గేమ్. టీ20ల్లో 150కి పైగా స్ట్రైక్ రేట్, 27.64 సగటుతో 691 పరుగులు చేశాడు. 33 వికెట్లు కూడా పడగొట్టాడు. చెన్నైతో జరిగిన మ్యాచులో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

RR vs KXIP: 'సంజు శాంసనే తర్వాతి ధోనీ' అన్న కాంగ్రెస్‌ ఎంపీ.. కాదంటున్న బీజేపీ ఎంపీ!!

Story first published: Monday, September 28, 2020, 12:47 [IST]
Other articles published on Sep 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X