న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్టన్ టర్నర్ చెత్త రికార్డు: టీ20ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో డకౌట్

IPL 2019 : Ashton Turner Bags Third Golden Duck In A Row, Sets New Record ! || Oneindia Telugu
RR vs DC: Ashton Turner bags third golden duck in a row, sets new record

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆటగాడు ఆస్టన్ టర్నర్‌కు 2019 ఐపీఎల్ ఎంతమాత్రం కలిసి రాలేదు. టీ20ల్లో ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా పేరొందిన ఆస్టన్ టర్నర్ ఈ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆస్టన్ టర్నర్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టీ20ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో డకౌట్

టీ20ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో డకౌట్

దీంతో టీ20ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన బ్యాట్స్‌మన్‌గా ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుతో ఈ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆస్టన్ టర్నర్ తొలి బంతికే పెవలియన్‌కు చేరాడు. జోస్ బట్లర్ ఇంగ్లాండ్‌కు పయనం కావడంతో అతడి స్థానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చోటు దక్కించుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో

అయితే, ఈ మ్యాచ్‌లో కూడా డౌకట్‌గా పెవిలియన్‌కు చేరాడు. తాజాగా సోమవారం జైపూర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సున్నాకే పెవిలియన్‌ చేరాడు. టర్నర్‌పై క్రికెట్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకోవడం... అయితే, అతడు తీవ్రంగా నిరాశపరచడంతో క్రికెట్‌ అభిమానులు సోషల్ మీడియాలో తెగ విమర్శలు చేస్తున్నారు.

బిగ్‌బాష్‌ లీగ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో

బిగ్‌బాష్‌ లీగ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో

కాగా, అంతకుముందు బిగ్‌బాష్‌ లీగ్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆస్టన్ టర్నర్ డకౌట్‌గా ఔటయ్యాడు. ఈ క్రమంలో టీ20ల్లో వరుసగా మ్యాచ్‌ల్లో డకౌట్‌ అయిన ఆటగాడిగా ఆస్టన్ టర్నర్ నిలిచాడు. అంతేకాదు ఈ ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన ఆటగాళ్లలో అగ్రస్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో వరుసగా డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితా:

టీ20ల్లో వరుసగా డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితా:

ప్లేయర్ డక్స్ సంవత్సరం
ఆస్టన్ టర్నర్ 5 2019
సి గణపతి 4 2007-2009
షేన్ షీలింగ్ ఫోర్డ్ 4 2008-2010
టిమ్ సౌథీ 4 2011- 2012
మాథ్యా హోగార్డ్ 4 2011-2012
లసిత్ మలింగ 4 2013
మురళీ కార్తీక్ 4 2013-14
ఆదిత్య తారే 4 2017-18
రాబిన్ టోకో 4 2019
Story first published: Tuesday, April 23, 2019, 14:37 [IST]
Other articles published on Apr 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X