న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs CSK: టెక్నాలజీని సరైన విధంగా వాడాలి.. అంపైర్‌పై సాక్షి ధోనీ ఫైర్!!

RR vs CSK: MS Dhoni Wife Sakshi Dhoni Slams Umpire After Tom Curran Controversy

రాంచీ: మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుతో జరిగిన పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. 217 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ధోనీసేన 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఛేదనలో ఫాఫ్ డుప్లెసిస్ ‌(72; 36 బంతుల్లో 1x4, 7x6) చెలరేగినా ఇతర బ్యాట్స్‌మెన్‌ రాణించలేకపోయారు. షేన్ ‌వాట్సన్ ‌(33), మురళీ విజయ్‌ (21), సామ్‌ కరన్ ‌(17), కేదార్‌ జాధవ్ ‌(22) ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. చివరి ఓవర్‌లో కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (28; 16 బంతుల్లో 3x6) హ్యాట్రిక్‌ సిక్సులు బాదడంతో చెన్నై స్కోర్‌ 200కి చేరింది.

అప్పీల్ చేయగా

అప్పీల్ చేయగా

ఈ మ్యాచ్‌లో టామ్ కరన్ ఔట్ విషయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా.. పేసర్ దీపక్ చాహర్ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో బౌలింగ్ దిగాడు. ఆ ఓవర్ ఐదో బంతిని టామ్ కరన్ ఫుల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్‌కి తగలకుండా థై ఫ్యాడ్స్‌ని తాకింది. కీపర్ ఎంఎస్ ధోనీ ఆ బంతిని క్యాచ్‌గా అందుకుని అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ సి షంషుద్దీన్ ఔట్ ఇచ్చాడు.

అంపైర్ల చర్చలు

అంపైర్ల చర్చలు

బంతి తన బ్యాట్‌కి తాకలేదని టామ్ కరన్ డీఆర్‌ఎస్ కోరే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే రాహుల్ తెవాటియా రాజస్థాన్ రాయల్స్‌కి ఉన్న ఏకైక డీఆర్‌ఎస్‌ని వాడుకున్నాడు. దాంతో కరన్ నిరాశగా పెవిలియన్‌కి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. కొంత దూరం వెళ్లాక అంపైర్లు చర్చలు చేస్తుండంతో కరన్ మైదానాన్ని వీడలేదు. కరన్ ఔట్ విషయాన్ని లెగ్ అంపైర్‌ వినీత్ కులకర్ణితో చర్చించిన షంషుద్దీన్.. థర్డ్ అంపైర్‌ను సంప్రదించారు. సరైన నిర్ణయం చెప్పాల్సిందిగా వారు కోరారు.

ఎల్బీడబ్ల్యూ అవకాశాన్ని చెక్ చేయలేదు

ఎల్బీడబ్ల్యూ అవకాశాన్ని చెక్ చేయలేదు

రిప్లేలో ఎంఎస్ ధోనీ క్యాచ్ అందుకోవడానికి ముందే బంతి నేలకు తాకించినట్లు తేలింది. అలాగే బంతి కరన్ బ్యాట్‌ను హిట్ చేయలేదని థర్డ్ అంపైర్‌ పరిశీలనలో స్పష్టమైంది. దీంతో అంపైర్ షంషుద్దీన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే థర్డ్ అంపైర్ ఇక్కడో విషయాన్ని గమనించలేదు. ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాన్ని మాత్రం చెక్ చేయలేదు. రిప్లేలో బంతి వికెట్లను తాకేలా కనిపించింది. థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ అయ్యే ఛాన్స్ పరిశీలిస్తే.. కరన్ పెవిలియన్‌కు చేరేవాడు.

టెక్నాలజీని సరైన విధంగా వాడాలి

టెక్నాలజీని సరైన విధంగా వాడాలి

ఈ విషయంపై చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ స్పందించారు. 'థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడో, లేదో అని పరిశీలిస్తే..టామ్ కరన్ పెవిలియన్‌కు చేరేవాడు' అంటూ ట్విట్ చేశారు. 'టెక్నాలజీని సరైన విధంగా వాడాలి. క్యాచ్, ఎల్బీడబ్ల్యూ రెండు ఔటే' అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత సాక్షి తన పోస్టును డిలీట్ చేయడం విశేషం.

Story first published: Wednesday, September 23, 2020, 17:05 [IST]
Other articles published on Sep 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X