న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RP Singh : చాలా విషయాలు మారాలి.. టీ20 ప్రపంచకప్ ముందు ఇలాంటి ప్రదర్శన అరిష్టాన్ని సూచిస్తోంది

RP Singh Concerns About Indian Bowling Attack, It is not A Great sign Ahead Of T20 Worldcup

209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ (0/52), హర్షల్ పటేల్ (0/49), యుజువేంద్ర చాహల్ (1/42) సహా భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుని భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేయలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా అంత భారీ స్కోరును కూడా సులభంగా ఛేదించింది.

అయితే భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఉమేష్ యాదవ్ కూడా రెండు ఓవర్లు వేసి 27పరుగులిచ్చాడు. ఇక ఈ మ్యాచ్ విషయంలో భారత బౌలర్లు తమ ప్రణాళికలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నాడు.

ఇది గొప్ప సంకేతం కాదు

ఇది గొప్ప సంకేతం కాదు

'టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇది గొప్ప సంకేతం కాదు. అరిష్టాన్ని సూచిస్తుంది. ఆసియా‌కప్‌లో భారత్ రాణించలేనప్పుడు.. హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా లేరు కదా బహుశా పేస్ విభాగం డల్‌గా ఉందేమో అనుకున్నాం. ఈ గేమ్‌కు హర్షల్ పటేల్ ఉన్నాడు. కానీ ఏం చేశాడో చూశాం. ఓటమి తప్పలేదు. ఇప్పుడు బుమ్రా లేడు కాబట్టి అంటున్నారు. ఇక జస్ప్రీత్ బుమ్రా వచ్చాక అతని బౌలింగ్ కూడా అంత ప్రభావవంతగా పడకపోవచ్చు.' అని ఆర్పీ సింగ్ క్రిక్‌బజ్‌లో చెప్పాడు.

 వచ్చీ రాగానే గేమ్‌లను గెలిపిస్తారనుకోవద్దు

వచ్చీ రాగానే గేమ్‌లను గెలిపిస్తారనుకోవద్దు

'కాబట్టి మన స్టార్ ప్లేయర్లు గాయం నుంచి తిరిగి జట్టులోకి వచ్చి రాగానే గేమ్‌లను గెలిపిస్తారని మనం ఆశించొద్దు. అలా ఆశించి చివరికి మ్యాచ్‌లు కోల్పోతున్నాం. జట్టు మేనేజ్‌మెంట్ అందుబాటులో ఉన్న ప్లేయర్లనే సరిగా ఉపయోగించుకోవాలి. టీ20 ప్రపంచకప్‌కు చేరువయ్యే కొద్దీ జట్టు ప్రదర్శన మరింత తగ్గుతోంది. భారత బౌలర్లు మ్యాచ్‌ను నియంత్రించలేకపోతున్నారు.' అని ఆర్పీ సింగ్ తెలిపాడు.

ప్రణాళికలను సరిగా అమలు చేయలేదు

ప్రణాళికలను సరిగా అమలు చేయలేదు

'ఆస్ట్రేలియా ఛేదించేటప్పుడు టీమిండియా అసలు ఆధిపత్యం చెలాయించినట్లే కన్పించలేదు. ఏ పరిస్థితిలోనూ మ్యాచ్ మన వైపు ఉన్నట్లు కన్పించలేదు. ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రమం తప్పకుండా బౌండరీలు బాదుతూనే ఉన్నారు. అదే టైంలో నిలకడగా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేసుకున్నారు. ఉమేష్ యాదవ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. అయినా ఆసీస్ వేట ఆగలేదు. దీన్ని బట్టి భారత బౌలర్లు తమ ప్రణాళికను సరిగ్గా అమలు చేయలేకపోయి ఉండవచ్చు' అని ఆర్పీ సింగ్ వెల్లడించాడు.

ఫీల్డింగ్ మార్పులు జరగాల్సిందే

ఫీల్డింగ్ మార్పులు జరగాల్సిందే

భారత బౌలింగ్ యూనిట్ మీద మరోసారి తీవ్ర విమర్శలు రావడంతో మేనేజ్‌మెంట్ మున్ముందు మ్యాచ్‌లలో రాణించడానికి జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని ఆర్పీ అన్నాడు. 'వైడ్ యార్కర్లను బౌలింగ్ చేస్తున్నప్పుడు.. మీరు పాయింట్లో లేదా సర్కిల్ లోపల థర్డ్ మ్యాన్‌ను పెట్టొద్దు. ఆ విషయాన్ని అసలు చూసుకోవట్లేదు.

ఫీల్డింగ్ విషయంలోను పెద్ద మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే మ్యాచ్‌లో భారత్ అస్సలు గేమ్‌లో ఉండదు.' అని ఆర్పీ చెప్పాడు. సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండో టీ20 సెప్టెంబర్ 23న నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరగనుంది.

Story first published: Thursday, September 22, 2022, 16:06 [IST]
Other articles published on Sep 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X