న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డి కాక్‌ను సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

IPL 2019 : Mumbai Indians Buy Quinton De Kock From Royal Challengers Bangalore
Royal Challengers Bangalore sell Quinton de Kock to Mumbai Indians in first IPL player tradeoff

న్యూ ఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్ కోసం అప్పుడే ఆటగాళ్ల కొనుగోళ్లు ప్రారంభమైపోయాయి. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్‌ని తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ రూ. 2.8 కోట్లకి కొనుగోలు చేసింది. వాస్తవానికి డిసెంబరు 16న గోవా వేదికగా ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం జరగనుంది.

గతేడాది వేలం తర్వాత మిగిలిన సొమ్ము‌ని

గతేడాది వేలం తర్వాత మిగిలిన సొమ్ము‌ని

కానీ.. ఆ వేలం సమయానికి టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీల వద్ద గతేడాది వేలం తర్వాత మిగిలిన సొమ్ము‌ని మినహాయించి అదనంగా రూ.3 కోట్లు డబ్బు ఉండాలనేది నిబంధన. దీంతో.. అన్ని ఫ్రాంఛైజీలు తాము వద్దనుకున్న ఆటగాళ్లను విడిచిపెట్టడంతో పాటు.. తమకి కావాల్సిన క్రికెటర్లని కొనుగోలు చేయడం మొదలెట్టాయి.

2018 సీజన్ వేలంలో డికాక్‌ని రూ. 2.8 కోట్లకే

2018 సీజన్ వేలంలో డికాక్‌ని రూ. 2.8 కోట్లకే

ఈ సర్దుబాట్లలో భాగంగా తొలి కొనుగోలుని ముంబై ఫ్రాంఛైజీ డికాక్ రూపంలో చేపట్టింది. ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో డికాక్‌ని రూ. 2.8 కోట్లకే బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా డికాక్‌ని కొనుగోలు చేసిన ముంబై ఫ్రాంఛైజీ.. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ. 2.2 కోట్లు), శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ అఖిల ధనంజయ (రూ.50 లక్షలు)లను విడిచిపెట్టింది.

34 మ్యాచ్‌ల్లో 927 పరుగులు

34 మ్యాచ్‌ల్లో 927 పరుగులు

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకి ఆడిన డికాక్.. ఇప్పటి వరకు 34 మ్యాచ్‌ల్లో 927 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఆరు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే.. ముంబై జట్టులో ఇప్పటికే ఇషాన్ కిషన్, ఆదిత్య తారె రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు.

ముంబై.. వికెట్ కీపర్ అయిన డికాక్‌ని

ముంబై.. వికెట్ కీపర్ అయిన డికాక్‌ని

కానీ.. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్‌)కి తోడుగా ప్రొఫెషనల్ ఓపెనర్‌ కోసం ఎదురుచూస్తున్న ముంబై.. తాజాగా ఓపెనర్/ వికెట్ కీపర్ అయిన డికాక్‌ని ఒడిసిపట్టేసింది. ఐపీఎల్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మిడిలార్డర్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.

Story first published: Saturday, October 20, 2018, 16:14 [IST]
Other articles published on Oct 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X