న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ క్రికెట్‌లో ఓ స్టార్ శకం ముగిసింది: జాతీయ గీతం పాడుతూ కన్నీటి పర్యంతం: చివరి మ్యాచ్‌లో ఇలా

Ross Taylor was dismissed for 14 runs in his last International cricket match against Netherlands

వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ స్టార్ బ్యాటర్ శకం ముగిసింది. తన కేరీర్‌లో చిట్టచివరి వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌ను ఆడేశాడు. బ్యాటింగ్‌లో కాస్త త్వరగానే అవుట్ అయ్యాడు. చివరి వన్డే కావడంతో అతనికి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు కూడా అతనికి వీడ్కోలు పలికారు. క్రీజ్‌లోకి దిగే సమయంలో ఎంత భావోద్వేగానికి గురయ్యాడో.. పెవిలియన్ దారి పట్టినప్పుడూ ఆ క్రికెటర్ అంతే ఎమోషన్‌ అయ్యాడు.

రాస్ టేలర్.. చివరి వన్డే..

అతనే- రాస్ టేలర్.. న్యూజిలాండ్ బ్యాటింగ్ బ్యాక్ బోన్. నెదర్లాండ్స్‌పై చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. 16 బంతుల్లో ఒక ఫోర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వ్యాన్ బీక్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు రాస్ టేలర్. హామిల్టన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఆరు వికెట్లు నష్టపోయి 47 ఓవర్లల్లో 289 పరుగులు చేసింది.

గప్టిల్, విల్ యంగ్ సెంచరీలు..

ఓపెనర్ మార్టిన్ గప్టిల్.. సుదీర్ఘకాలం తరువాత ఫామ్‌లోకి వచ్చాడు. 123 బంతుల్లో రెండు సిక్సర్లు 11 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ హెన్రీ నికోల్స్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. వన్‌డౌన్ బ్యాటర్ విల్ యంగ్ సైతం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 112 బంతుల్లో నాలుగు సిక్సర్లు ఆరు ఫోర్లతో 120 పరుగులు చేసి, ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. హెన్రీ నికోల్స్ అవుట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చాడు రాస్ టేలర్. బంతికి ఒక పరుగు చొప్పన ఆడాడు. వ్యాన్ బీక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇదే అతని చివరి వన్డే.

పాక్‌పై అద్భుత ఇన్నింగ్..

పాక్‌పై అద్భుత ఇన్నింగ్..

రాస్ టేలర్ అనగానే- 2011 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై ఆడిన సునామీ ఇన్నింగ్ గుర్తుకు వస్తుంది. ఆ మ్యాచ్‌లో టేలర్ 124 బంతుల్లో 131 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు టేలర్. రాస్ టేలర్ తన సహచరులతో కలిసి చివరి నాలుగు ఓవర్లల్లో 92 పరుగులు పిండుకున్నాడంటే అతని ఇన్నింగ్ వేగం ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఓ చిరస్మరణీయమైన ఇన్నింగ్ ఆడాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలు అనేకం.

కన్నీళ్లు పెట్టుకున్న టేలర్

కన్నీళ్లు పెట్టుకున్న టేలర్

మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ఆలపించే సమయంలో రాస్ టేలర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకున్నాడు. ఉబికి వస్తోన్న కన్నీళ్లను దాచుకోలేకపోయాడు. జాతీయ గీతం ముగిసేంత వరకూ కళ్లను తుడుచుకుంటూ కనిపించాడు. తన కేరీర్ మొత్తంలో రాస్ టేలర్ 451 మ్యాచ్‌లు ఆడాడు. 18,213 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 42.72. 40 సెంచరీలు, 93 అర్దసెంచరీలను నమోదు చేశాడు. 1,766 బౌండరీలు, 273 సిక్సులు అతని బ్యాట్ నుంచి జాలువారాయి.

Story first published: Monday, April 4, 2022, 11:33 [IST]
Other articles published on Apr 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X