న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిజంగా అదృష్టం.. ఇన్ని మ్యాచ్‌లు ఆడుతాననుకోలేదు : టేలర్

 Ross Taylor Says Probably lucky with the timing on approaching 100 Tests milestone

హామిల్టన్‌: భారత్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల్లో ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించిన న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. ఐదు టీ20ల సిరీస్‌లో ఈ కివీస్ బ్యాట్స్‌మన్ పొట్టి ఫార్మాట్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం భారత్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నదమవుతున్న టేలర్.. సంప్రదాయక ఫార్మాట్‌లో 100వ మ్యాచ్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఇప్పటికే 99 టెస్ట్‌లు ఆడిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్.. భారత్‌తో ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో టెస్ట్‌ల్లో కూడా సెంచరీ మ్యాచ్‌ల ఫీట్‌ను అందుకోనున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కనున్నాడు.

ఈ అరుదైన ఫీట్‌పై రాస్‌టేలర్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. అసలు తాను ఇంతకాలం ఆడుతానని ఊహించనేలేదని మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

9.55 సెకన్లలోనే 100 మీటర్లు.. గేదెలతో బోల్ట్ రికార్డు బ్రేక్ చేసిన కన్నడ వ్యక్తి!!9.55 సెకన్లలోనే 100 మీటర్లు.. గేదెలతో బోల్ట్ రికార్డు బ్రేక్ చేసిన కన్నడ వ్యక్తి!!

భవిష్యత్తులో చాలా మంది..

భవిష్యత్తులో చాలా మంది..

‘దక్షిణాఫ్రికాతో నా తొలి టెస్టు సిరీస్‌ తర్వాత లాంగెస్ట్ ఫార్మాట్‌లో ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని ఊహించలేదు. వరుసగా ప్రతీ మ్యాచ్‌ ఆడుతూ ఉండటం నిజంగా అదృష్టం. భవిష్యత్తులో మరింత మంది ఆటగాళ్లు తమ దేశం తరఫున అన్ని ఫార్మాట్లలో

100 మ్యాచ్‌లు ఆడుతారని ఆశిస్తున్నా.'అని టేలర్ తెలిపాడు.

నా అత్యుత్తమ ఇన్నింగ్స్ ..

నా అత్యుత్తమ ఇన్నింగ్స్ ..

ఇంగ్లంపై సెంచరీ చేసిన తర్వాత లాంగెస్ట్ ఫార్మాట్‌పై నమ్మకం పెరిగిందని టేలర్ చెప్పుకొచ్చాడు.‘ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తర్వాత నా టెస్టు కెరీర్‌పై నాకు నమ్మకం ఏర్పడింది. మాంచెస్టర్‌లో నేను సాధించిన 158 పరుగులు నా అత్యుత్తమ ఇన్నింగ్స్​. అలాగే శ్రీలంకపై కొలంబోలో 140, 170 పరుగులు కూడా మరచిపోలేనివి. ఆస్ట్రేలియాపై చేసిన 290 స్కోరు కూడా నా కెరీర్‌ బెస్ట్ ఇన్నింగ్స్‌‌లో ఒకటి.'అని అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఏవి అన్న ప్రశ్నకు సమాధానంగా టేలర్ తెలిపాడు.

వెల్లింగ్టన్‌కు ప్రత్యేక స్థానం..

వెల్లింగ్టన్‌కు ప్రత్యేక స్థానం..

తన కెరీర్‌లో సాధించినవాటిపట్ల సంతోషంగా ఉన్నానని టేలర్ తెలిపాడు. తన మదిలో వెల్లింగ్టన్‌ది ప్రత్యేక స్థానమన్నాడు. ‘ఈ సుదీర్ఘ జర్నీ చాలా సంతోషాన్నిచ్చింది. న్యూజిలాండ్‌ తరుఫున ఇంతటి క్రికెట్‌ ఆడటం గౌరవంగా భావిస్తున్నా. వెల్లింగ్టన్‌కు నా గుండేలో ప్రత్యేక స్థానం ఉంది. నా కోసం ఫ్యామిలీ చాలా త్యాగాలు చేసింది. నేను వరుసగా క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతూ ఉండటంపై ఫ్యామిలీని చాలా మిస్సయ్యాను. నా భార్యే పిల్లలకు అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఫ్యామిలీ సపోర్ట్‌ వల్లే ఇక్కడ వరకూ వచ్చా. ఫ్యామిలీ సహకారం లేకపోతే ఈ లాంగ్‌ జర్నీ ఉండేది కాదు. మా పిల్లలు కూడా నా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. 'అని తెలిపాడు.

నా కూతురు భారత్‌కు వెళ్ధామంటుంది..

నా కూతురు భారత్‌కు వెళ్ధామంటుంది..

‘నేను ఎప్పుడూ ఏదొకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. న్యూజిలాండ్‌కు ఎప్పుడూ ఆడాలనుకుంటాను. నా కంటే ఎక్కువగా నా ఫ్యామిలీ త్యాగం చేసింది. ఇప్పుడు నా పిల్లలు ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. నా కూతురు భారత్‌ పర్యటనకు వెళదామని అంటోంది' అని టేలర్‌ పేర్కొన్నాడు.

Story first published: Friday, February 14, 2020, 15:08 [IST]
Other articles published on Feb 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X