ఛేదనలో రాస్ టేలర్ అరుదైన రికార్డు: కివీస్ తరుపున రెండో ఆటగాడు

Posted By:
Ross Taylor nearly topped the record for the highest ODI score in a chase

హైదరాబాద్: డబ్లిన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాస్ టేలర్ (181 నాటౌట్) పరుగులు సాధించడంతో ఐదు వన్డేల సిరిస్‌లో న్యూజిలాండ్ ఆశలు సజీవంగా ఉంచుకున్న సంగతి తెలిసిందే. లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

కెరీర్‌లోనే ది బెస్ట్‌కు రాస్ టేలర్: ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం

ఈ ఛేదనలో రాస్ టేలర్ కొన్ని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు న్యూజిలాండ్ తరుపున ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రాస్ టేలర్ చరిత్ర సృష్టించాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు మార్టిన్‌ గుప్టిల్‌ (180 నాటౌట్) పేరిట ఉంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాస్ టేలర్ దానిని అధిగమించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఛేజింగ్‌లో ఆత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్ (185 నాటౌట్), భారత్‌కు చెందిన ధోని (183 నాటౌట్), విరాట్ కోహ్లీ (183) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇక, న్యూజిలాండ్ తరుపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రాస్ టేలర్‌ (7267 పరుగులు) నిలిచాడు. నాలుగో వన్డేలో 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాస్ టేలర్ ఈ ఘనత సాధించాడు. అంతక ముందు రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ నాథన్‌ ఆస్టల్‌ (7090)ను టేలర్‌ అధిగమించాడు.

వన్డేల్లో న్యూజిలాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీఫెన్ ప్లెమింగ్ (8007 పరుగులు)తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 7086 వన్డే పరుగులతో ఉన్న రాస్ టేలర్‌ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

ఐదు వన్డేల సిరిస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో సిరిస్ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో తేల్చే ఐదో వన్డే ఇరు జట్ల మధ్య శనివారం (మార్చి 10)న క్రైస్ట్ చర్చ్ వేదికగా జరగనుంది. వన్డే సిరిస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, March 7, 2018, 19:44 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి