న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీ టెస్టులో రాస్ టేలర్ అరుదైన ఘనత

Ross Taylor becomes New Zealands highest scorer in Test cricket

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ వెటరన్ క్రికెటర్ రాస్ లేటర్ అరుదైన ఘనత సాధించాడు. సుదీర్ఘ కాలంగా న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న రాస్ టేలర్ ఆ దేశం తరుపున అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన చివరిదైన మూడో టెస్టులో రాస్ టేలర్‌ ఈ ఘనత సాధించాడు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు సాధించిన రాస్ టేలర్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 22 పరుగులే సాధించి నిరాశ పరిచినప్పటికీ ఓ ఈ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

<strong>హెయిర్ డ్రయర్స్‌‌తో పిచ్‌ని ఆరబెడతారా?: భారత్-లంక తొలి టీ20 రద్దుపై నెటిజన్ల జోకులు!</strong>హెయిర్ డ్రయర్స్‌‌తో పిచ్‌ని ఆరబెడతారా?: భారత్-లంక తొలి టీ20 రద్దుపై నెటిజన్ల జోకులు!

అంతకముందు ఈ రికార్డు న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(7,172) పేరిట ఉండేది. సిడ్నీలో ఆ రికార్డుని రాస్ టేలర్ అధిగమించాడు. ప్రస్తుతం రాస్ టేలర్‌ 7,175 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... బ్రెండన్‌ మెకల్లమ్‌(6,453) మూడో స్థానంలో కేన్‌ విలియమ్సన్‌(6,379), మార్టిన్‌ క్రో(5,444)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఆసీస్‌కు ఐదు పరుగుల పెనాల్టీ: అంఫైర్‌తో వాగ్వాదానికి దిగిన వార్నర్ (వీడియో)ఆసీస్‌కు ఐదు పరుగుల పెనాల్టీ: అంఫైర్‌తో వాగ్వాదానికి దిగిన వార్నర్ (వీడియో)

ఇదిలా ఉంటే, మూడో టెస్టులో న్యూజిలాండ్ 279 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-0తో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన మార్నస్ లబుషేన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Monday, January 6, 2020, 13:22 [IST]
Other articles published on Jan 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X