న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ నిర్దయగా రెచ్చిపోయాడు, పాంటింగే బెస్ట్!!

India vs West Indies 2nd T20I : Brian Lara Comments On Rohit Sharma's Game | Oneindia Telugu
Rohit Up There With the Greats of the Game: Brian Lara

లక్నో: రెండు ఫార్మాట్‌లలో విజయం సాధించి టీ20ల్లోనూ శుభారంభాన్ని నమోదు చేసిన టీమిండియా వెస్టిండీస్‌పై మరోసారి జులుం చూపించింది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయి సెంచరీ బాదాడు. ఓపెనర్‌గా దిగిన రోహిత్.. క్రీజులో పాతుకుపోయాడు. రోహిత్‌ శర్మ (111 నాటౌట్‌; 61 బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సులు)తో దూకుడుగా ఆడాడు.

రెండు ఫార్మాట్‌లలో విజయం సాధించి టీ20ల్లోనూ శుభారంభాన్ని నమోదు చేసిన టీమిండియా వెస్టిండీస్‌పై మరోసారి జులుం చూపించింది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయి సెంచరీ బాదాడు. ఓపెనర్‌గా దిగిన రోహిత్.. క్రీజులో పాతుకుపోయాడు. రోహిత్‌ శర్మ (111 నాటౌట్‌; 61 బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సులు)తో మరిచిపోయాడు.

రోహిత్.. విధ్వంసక సెంచరీ చేయడంతో

రోహిత్.. విధ్వంసక సెంచరీ చేయడంతో

రోహిత్.. విధ్వంసక సెంచరీ చేయడంతో మంగళవారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో భారత్‌ 71 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించింది. ఈ ప్రదర్శన పట్ల వెస్టిండీస్ జట్టు మాజీ క్రికెటర్ బ్రెయిన్ లారా హర్షం వ్యక్తం చేశాడు. కానీ, వెస్టిండీస్‌పై ఇలా రెచ్చిపోవడానికి కారణం.. ఓ రకంగా చూస్తే విండీస్ జట్టు వైఫల్యం కూడా ఉందంటూ అభిప్రాయపడ్డాడు.

 క్రికెట్‌ బంతితో పోలిస్తే గోల్ఫ్‌ బంతి

క్రికెట్‌ బంతితో పోలిస్తే గోల్ఫ్‌ బంతి

ఇంకా తాను గోల్ప్ కెరీర్ గురించిన విషయాలను చర్చించాడు. క్రికెట్‌ బంతితో పోలిస్తే గోల్ఫ్‌ బంతి చాలా చిన్నది. అయితే ఆ చిన్న బంతి తనను చాలా ఇబ్బంది పెట్టిందని విండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రయాన్‌ లారా చెప్పుకొచ్చాడు. 1994 నుంచి గోల్ఫ్‌ ఆడుతున్నా, ఇప్పటికీ తనకు గోల్ఫ్‌ బంతి అర్థం కాలేదని చెప్పాడు. మొదటి నుంచీ తనకు గోల్ఫ్‌ అంటే ఇష్టమని.. అయితే ఆ క్రీడ తన బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తుందన్న ఉద్దేశంతో.. కెరీర్‌ ఆరంభంలో గోల్ఫ్‌పై అంతగా ఆసక్తి చూపలేదన్నాడు.

 గోల్ఫ్‌లో చేసినట్లు కాకుండా మణికట్టు నిటారుగా

గోల్ఫ్‌లో చేసినట్లు కాకుండా మణికట్టు నిటారుగా

‘గోల్ఫ్‌.. చిత్రమైన క్రీడ. క్రికెట్లో బంతి బౌన్స్‌ అయినా, స్వింగయినా.. ఎలా వచ్చినా ఆడడానికి ఎన్నడూ నేను ఇబ్బంది పడలేదు. ఈ బంతి నాకు క్రమశిక్షణ, ఓపిక కూడా నేర్పింది. ‘నేను గోల్ఫ్‌ మొదలుపెట్టినప్పుడు నన్ను అంతా విండీస్‌ దిగ్గజం గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌తో పోల్చారు. సోబర్స్‌ కూడా క్రికెట్‌తో పాటు గోల్ఫ్‌ ఆడేవాడు. క్రికెట్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నపుడు గోల్ఫ్‌లోలా కాకుండా మణికట్టును నిటారుగా ఉంచాలి' అని లారా చెప్పాడు.

పాంటింగ్‌ అత్యుత్తమ గోల్ఫర్‌.

పాంటింగ్‌ అత్యుత్తమ గోల్ఫర్‌.

లారాతో పాటు.. మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్‌, జాక్వెస్‌ కలిస్‌, రికీ పాంటింగ్‌ కూడా క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత గోల్ఫ్‌ బాట పట్టారు. ఈ ముగ్గురిలో పాంటింగ్‌ మంచి గోల్ఫర్‌ అని లారా కితాబిచ్చాడు. ‘గోల్ఫ్‌లో కలిస్‌, కపిల్‌దేవ్‌ పేర్లను ఎప్పటినుంచో వింటున్నా. అయితే పాంటింగ్‌ అత్యుత్తమ గోల్ఫర్‌. నిలకడగా ఆడతాడు' అని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ని లారా ప్రశంసించాడు.

Story first published: Wednesday, November 7, 2018, 11:28 [IST]
Other articles published on Nov 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X