న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ దూరం: బీసీసీఐ అధికారిక ప్రకటన

Rohit Sharma will be joining the ODI squad on 8th January, 2019

హైదరాబాద్: నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైనా నాలుగో టెస్టుకు టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మ దూరం కానున్నాడు. రోహిత్ శర్మ భార్య రితికా ఆదివారం పండంటి పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లితో పాటు బిడ్డను చూసేందుకు రోహిత్ శర్మ భారత్‌కు తిరుగుపయనమయ్యాడు.

తండ్రి అయిన రోహిత్‌ శర్మ: పండంటి పాపకు జన్మనిచ్చిన భార్య రితికాతండ్రి అయిన రోహిత్‌ శర్మ: పండంటి పాపకు జన్మనిచ్చిన భార్య రితికా

సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ దూరం

సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ దూరం

ఈ మేరకు సోమవారం భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఓ ప‍్రకటనలో వెల్లడించింది. "ఆస్ట్రేలియా నుంచి భారత్‌కి రోహిత్ శర్మ త్వరలో వెళ్లనున్నాడు. అతని భార్య రితిక ఆదివారం ఓ పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. పాపని చూసేందుకు రోహిత్ శర్మ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అతని రాకతో భారత్ జట్టులో సమతూకం వచ్చింది. సిడ్నీ టెస్టులోనూ అతను ఆడితే బాగుంటుంది. తొలి బిడ్డకి జన్మనిచ్చిన ఈ సమయంలో రితిక పక్కన రోహిత్ ఉండటం చాలా ముఖ్యం" అని బీసీసీఐ అందులో పేర్కొంది.

జనవరి 8 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరిస్‌కు అందుబాటులో

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ అనంతరం జనవరి 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రోహిత్‌ శర్మ తిరిగి ఆస్ట్రేలియాకు వస్తాడని బీసీసీఐ తెలిపింది. తొమ్మిది నెలలు తర్వాత భారత టెస్టు జట్టులోకి ఇటీవలే పునరాగమనం చేసిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 37, 1 పరుగులతో నిరాశపరిచాడు.

 జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు

జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు

ఆ తర్వాత గాయం కారణంగా పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. కాగా, ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ (63 నాటౌట్‌) రాణించగా, రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.

Story first published: Monday, December 31, 2018, 14:02 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X