న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: శార్దూల్ ఠాకూర్‌పై కస్సుమన్న రోహిత్ శర్మ( వీడియో)

Rohit Sharma vents his frustration on Shardul Thakur after smashed for successive boundaries

ఇండోర్: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయని శార్దూల్ ఠాకూర్‌పై కస్సుమన్నాడు. ఫీల్డింగ్ తగ్గట్లు బౌలింగ్ చేయకుండా బౌండరీలు బాదేటట్లు ఎందుకు బౌలింగ్ చేస్తున్నావని మందలించాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రోహిత్ శర్మ తీరును తప్పుబడుతుంటే.. మరికొందరు మాత్రం అలానే వ్యవహరించాలని, లేకుంటే ఆటగాళ్లకు భయం ఉండదని మద్దతు తెలుపుతున్నారు.

అసలేం జరిగిందంటే..?

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 26వ ఓవర్‌లో క్రీజులో సెట్ అయిన డారిల్ మిచెల్‌ను షార్ట్ పిచ్ బాల్‌తో పెవిలియన్ చేర్చిన శార్దూల్ ఠాకూర్.. ఆ మరుసటి బంతికే కెప్టెన్ టామ్ లాథమ్‌ను నకుల్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. రెండు వికెట్లు కోల్పోయినా.. సెంచరీతో సెట్ అయిన డెవాన్ కాన్వే వరుసగా రెండు బౌండరీలు బాదాడు. శార్దూల్ వేసిన షాట్ పిచ్ బాల్స్‌ను ముందే పసిగట్టి కాన్వే.. రెండు బౌండరీలు బాదాడు. దాంతో సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. అలా రెండు షాట్ పిచ్ బాల్స్ ఎందుకు వేసావని మండిపడ్డాడు. ఫీల్డింగ్ తగ్గట్లు బౌలింగ్ చేయాల్సింది కదా? అని మందలించాడు.

మెజిషియన్ అంటూ..

మెజిషియన్ అంటూ..

మ్యాచ్ అనంతరం శార్దూల్‌పై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'శార్దూల్‌ ప్రత్యేకంగా నిలిచాడు. కీలక సమయంలో వికెట్లు తీశాడు. అందుకే జట్టు సహచరులంతా అతడిని మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. సరైన సమయంలో బౌలింగ్‌తో అదరగొట్టాడు. ఇలాంటి అద్భుతమైన మరిన్ని మ్యాచ్‌లను ఇంకా ఆడాలి. అతడు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టే నేర్పు అలవర్చుకొన్నాడు. కేవలం వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లో కూడా వికెట్లు సాధిస్తున్నాడు. అతడు మాకు చాలా కీలకం. భవిష్యత్తులో కూడా అతడు ఇలానే రాణిస్తాడని ఆశిస్తున్నాను. ఇది జట్టుకు మంచి చేయడంతోపాటు.. వికెట్లు తీసుకోగలను అనే ఆత్మవిశ్వాసం అతడిలో పెరుగుతుంది. శార్దూల్‌ చాలా తెలివైనవాడు. దేశీయంగా చాలా క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. ఏం చేయాలనేదానిపై అవగాహన ఉంది'' అని పేర్కొన్నాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శార్దూల్..

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శార్దూల్..

ఈ మ్యాచ్‌లో 6 ఓవర్లు బౌలింగ్ చేసిన శార్దూల్.. 45 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో హార్దిక్ పాండ్యాతో కలిసి 17 బంతుల్లో 25 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోర్‌లో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Wednesday, January 25, 2023, 15:35 [IST]
Other articles published on Jan 25, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X