న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Adorable Pic: రోహిత్ ఒడిలో సమైరా, అభిమానులు పుల్ హ్యాపీ

Rohith Shares His Daughter's Photo In Social Media | Oneindia Telugu
Rohit Sharma shares an adorable pic with daughter Samaira

హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై సుదీర్ఘ పర్యటనను ముగించుకుని తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన ముద్దుల కుమార్తెతో సేదతీరుతున్న ఫొటోని టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న రోహిత్‌ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. తన గారాలపట్టి సమైరాను నిద్రపుచ్చుతున్న ఫోటోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన రోహిత్ శర్మ "ఇది ఎంతో ప్రత్యేకం, చాలా బాగుంది" అంటూ కామెంట్ పెట్టాడు.

<strong>గే వ్యాఖ్యలు: గాబ్రియల్‌పై నాలుగు వన్డేల నిషేధం</strong>గే వ్యాఖ్యలు: గాబ్రియల్‌పై నాలుగు వన్డేల నిషేధం

గతేడాది డిసెంబర్ 31న రోహిత్ శర్మ భార్య రితికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సొహైల్ ఖాన్ భార్య, రితికాకు బంధువు అయిన సీమా ఖాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విష‌యాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రోహిత్ శర్మ తన ముద్దుల కుమార్తె కోసం టెస్టు సిరిస్ మధ్యలోనే భార‌త్ తిరుగు ప‌య‌న‌మ‌య్యాడు.

దీంతో ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరమైన సంగతి తెలిసిందే. కాగా, రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఇటీవలే న్యూజిలాండ్ గడ్డపై మొట్టమొదటి సారి టీ20 సిరిస్‌ను కోల్పోయింది. మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 2-1తేడాతో ఓడిపోయి చేజార్చుకుంది.

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన రెండు వన్డేలు, మూడు టీ20ల సిరిస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో జరుగనున్న సిరీస్‌లో రోహిత్ శర్మతో పాటు భువనేశ్వర్, షమీలకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్... మూడో ఓపెనర్‌గా రహానేకు చోటు కల్పించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

Story first published: Thursday, February 14, 2019, 12:59 [IST]
Other articles published on Feb 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X