
బ్రేస్‌వెల్ బ్యాటింగ్ అమోఘం..
'నిజాయితీగా చెబుతున్నా.. బ్రేస్‌వెల్ బ్యాటింగ్ చేసిన విధానం, బంతిని క్లీన్‌గా హిట్ చేసిన తీరు.. మా బౌలర్లను ఎదుర్కొన్న విధానం అద్భుతం. మేం ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తే విజయం మాదేనని, బంతితో రాణించకుంటే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటామనే విషయం మాకు తెలుసు. దురదృష్టవశాత్తు అదే జరిగింది. మా బౌలర్ల సత్తాను పరీక్షించడానికే బ్యాటింగ్ తీసుకుంటున్నాని టాస్ సందర్భంగా చెప్పాను. కానీ ఇంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయని అస్సలు ఊహించలేదు.

శుభ్‌మన్, సిరాజ్ సూపర్బ్..
శుభ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్ చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం అతనికి ఉందనే శ్రీలంకతో సిరీస్‌లో అండగా నిలిచాం. చాలా స్వేచ్చగా ఆడగలిగే బ్యాటర్. బంతిని క్లీన్‌గా హిట్ చేయగలడు. మరో ఎండ్‌లో ఉండి అతని బ్యాటింగ్ చూడటం అద్భుతం. మహమ్మద్ సిరాజ్ బ్రిలియంట్ బౌలర్. ఈ మ్యాచే కాదు.. రెడ్ బాల్, టీ20 ఫార్మాట్‌లోనూ సత్తా చాటాడు. ఇప్పుడు వన్డేల్లో రాణిస్తున్నాడు. బంతితో అతను చేసేది చూడ ముచ్చటగా ఉంటుంది. సిరాజ్ తన ప్రణాళికల పట్ల చాలా క్లారిటీగా ఉంటాడు. పకడ్బందీగా అమలు చేస్తాడు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

శతక్కొట్టిన బ్రేస్‌వెల్
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్(78 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మిచెల్ సాంట్నర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 162 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ బిగ్ పార్ట్‌నర్‌షిప్‌ను సిరాజ్ విడదీయడం.. చివర్లో హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు బ్రేస్‌వెల్‌ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది.

శుభ్‌మన్ డబుల్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208) ఒక్కడే డబుల్ సెంచరీ బాదగా.. రోహిత్ శర్మ(34), సూర్యకుమార్ యాదవ్(31) రాణించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ షిప్లే, డారిల్ మిచెల్ రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్క్‌నర్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 337 పరుగులకు కుప్పకూలింది. బ్రేస్ వెల్‌కు తోడుగా మిచెల్ సాంట్నర్(57) రాణించాడు. భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షమీ, హార్దిక్ పాండ్యాకు తలో వికెట్ దక్కింది.