న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అన్నింటికన్నా మెగా టోర్నీనే అత్యుత్తమం.. ప్రపంచకప్‌లు గెలవాలనుంది: హిట్‌మ్యాన్

Rohit Sharma says I want to win World Cups, it’s the pinnacle of everything
Rohit Sharma Reveals His Major Goal In His Cricket Career!

ముంబై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 2019 ప్రపంచకప్‌లో రికార్డులు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో నాలుగు సెంచరీలతో ఈ జాబితాలో ఉన్న శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డును రోహిత్ బద్దలుగొట్టాడు. 2015 ప్రపంచకప్‌‌లో కుమార సంగక్కర నాలుగు సెంచరీలు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో రికార్డు స్థాయిలో మూడు డబుల్ సెంచరీలు చేసిన రికార్డు కూడా హిట్‌మ్యాన్‌పైనే ఉంది.

<strong>క్రికెట్‌ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ.. గేల్ విధ్వంసానికి ఏడేళ్లు!!</strong>క్రికెట్‌ చరిత్రలోనే వేగవంతమైన సెంచరీ.. గేల్ విధ్వంసానికి ఏడేళ్లు!!

సెమీ ఫైనల్‌లో ఓటమి

సెమీ ఫైనల్‌లో ఓటమి

రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు సెంచరీలు బాది టీమిండియాని సెమీ ఫైనల్‌కి చేర్చాడు. కానీ న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో మాత్రం త్వరగానే ఔట్ అవ్వడంతో.. భారత్ ఓడిపోయి ఇంటిబాట పట్టింది. దీంతో రోహిత్ శర్మ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. అయితే వ్యక్తిగతంగా ప్రపంచకప్‌లు గెలవాలని తాను ఆశిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు. తాజాగా ఇండియా టుడేతో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ప్రపంచకప్‌ గెలవాలని ఉంది

ప్రపంచకప్‌ గెలవాలని ఉంది

'ప్రపంచకప్‌ గెలవడం అందరి కల. వ్యక్తిగతంగానూ నాకు ప్రపంచకప్‌ గెలవాలని ఉంది. ఒక్కటే కాదు సాధ్యమైనన్ని. ప్రతిసారి భారీ అంచనాల మధ్య టోర్నీలో ఆడుతూ.. ప్రతి మ్యాచ్‌ గెలవాలని ఆశిస్తాం. కానీ ప్రపంచకప్‌ అనేది ఎప్పటికీ ప్రత్యేకం, అత్యుత్తమం' అని రోహిత్ శర్మ తెలిపాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత్ జట్టులో రోహిత్ శర్మకి చోటు లభించలేదు. దీంతో వన్డే ప్రపంచకప్‌‌ని ముద్దాడాలనే అతని కల అలానే మిగిలిపోయింది. 2007 టీ20 ప్రపంచకప్‌‌, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో రోహిత్ ఉన్నాడు.

ఖాళీ స్టేడియంలో ఆడటం విచిత్రంగా ఉంటుంది

ఖాళీ స్టేడియంలో ఆడటం విచిత్రంగా ఉంటుంది

'ఖాళీ స్టేడియంలో క్రికెట్ ఆడటం విచిత్రంగా ఉంటుంది. అభిమానులు అందుకు ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. నా చిన్నతనంలో ఎవరూ లేని చోట క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడిని. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఐపీఎల్ టోర్నీపై బోర్డు ఏ నిబంధనలతో ముందుకొస్తుందో.. వాటిని పాటించక తప్పుదు. ఇలా చేస్తే.. కనీసం అభిమానులు మమ్మల్ని టీవీలో అయినా చూస్తారు. వారికి అది కాస్త ఊరటనిస్తుంది' అని రోహిత్ అన్నాడు.

మూడు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా

మూడు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా

'మూడు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా. న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. గాయం కారణంగా ఆ పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యా. ఫిబ్రవరి 2న అంతర్జాతీయ స్థాయిలో చివరి బంతి ఆడా. ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్‌ ముగుస్తుందా, ఎంత త్వరగా తిరిగి మైదానంలో అడుగుపెడుతానా అని ఎదురుచూస్తున్నా' అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, April 23, 2020, 17:21 [IST]
Other articles published on Apr 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X