న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సరదా వ్యాఖ్యలు: రిషబ్ పంత్‌ కోసం రోహిత్ శర్మ, బోనీ ఫైన్ డిమాండ్

India vs australia : Rohit Sharma,Bonnie Paine Asks For Help Rishabh Pant | Oneindia Telugu
Rohit Sharma’s better-half Ritika won’t mind Rishabh Pant ‘babysit’ her daughter

హైదరాబాద్: సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించి అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు భలే గిరాకీ పెరిగింది. ఆస్ట్రేలియాతో ఇటీవలే ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తనదైన శైలిలో స్లెడ్జింగ్‌ చేసి రిషబ్ పంత్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

<strong>నా కళ్లు చెమర్చాయి: కోహ్లీసేనకు ట్రోఫీ బహుకరణపై సునీల్ గవాస్కర్</strong>నా కళ్లు చెమర్చాయి: కోహ్లీసేనకు ట్రోఫీ బహుకరణపై సునీల్ గవాస్కర్

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో "పంత్‌.. నా పిల్లలను ఆడించు.. నేను నా భార్యను సినిమాకు తీసుకెళ్తా" అని సరదాగా అన్న వ్యాఖ్యలను పంత్‌ అతను అన్నట్లే టిమ్ పైన్‌ భార్య బొనీ పైన్‌ను కలిసి వారి పిల్లలను ఆడించిన సంగతి తెలిసిందే.

గుడ్‌ మార్నింగ్‌ అంటూ పంత్ ట్వీట్

ఈ విషయాన్ని బొనీ పైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొనడంతో పాటు రిషబ్ పంత్ బెస్ట్‌ బేబీసిట్టర్‌ అని ప్రశంసలు కూడా కురిపించింది. అయితే, ఇటీవలే ఓ తండ్రి అయిన రోహిత్‌ శర్మ కూడా తన కుమార్తెని ఆడించాలని రిషబ్ పంత్‌ను కోరడం విశేషం. బుధవారం పంత్ గుడ్‌ మార్నింగ్‌ అంటూ ట్వీట్ చేశాడు.

రోహిత్ శర్మ రీట్వీట్ చేస్తూ

పంత్‌ ట్వీట్‌కు రోహిత్ శర్మ రీట్వీట్ చేస్తూ "శుభోధయం బడ్డీ.. నీవు మంచి బేబీ సిట్టర్‌వని విన్నా. రితికాను సంతోషంగా ఉంచాలంటే నాకు ఓ బేబీ సిట్టర్‌ కావాలి" అంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఇక్కడ రోహిత్‌ శర్మ ఒక్కడే పంత్‌ సాయం కోరడం లేదు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ భార్య బోనీ పైన్‌ సైతం మరోసారి పంత్‌ సాయం కోరింది.

మరోసారి నాపిల్లలను ఆడించవా

మరోసారి నాపిల్లలను ఆడించవా

"పంత్‌ నీవు ఫ్రీగా ఉంటే మరోసారి నాపిల్లలను ఆడించవా" అని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. పంత్‌ను బెస్ట్ బేబిసిస్టర్‌ను చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఆసీస్‌తో ఇటీవలే ముగిసిన బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్‌ 20 క్యాచ్‌లు, 350 పరుగులతో అద్భుతంగా రాణించాడు.

జనవరి 12 నుంచి వన్డే సిరిస్

జనవరి 12 నుంచి వన్డే సిరిస్

జనవరి 12 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరిస్‌ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జట్టులోకి రావడంతో పంత్ భారత్‌కు పయనం కానున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ వరకు జట్టుకు దూరంగా ఉండనున్నాడు. జనవరి 23 నుంచి భారత్‌-ఏ జట్టు తరపున పంత్ బరిలోకి దిగనున్నాడు.

రోహిత్ శర్మ ట్వీట్‌కు రిషబ్ పంత్ తనదైన శైలిలో స్పందించాడు. "హాహాహా... భాయ్ చాహాలా తన జాబ్‌ను సరిగా నిర్వర్తించడం లేదా? సమైరాకు బేబిసిస్టర్‌గా ఉండటం సంతోషమే. అభినందలు" అంటూ ట్వీట్ చేశాడు.

Story first published: Wednesday, January 9, 2019, 18:16 [IST]
Other articles published on Jan 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X