న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీడ్కోలు పలికిన వారిలో ఏ ఆటగాడిని పునరాగమనం చేయిస్తావు.. రోహిత్ ఎవరిని ఎంచుకున్నాడో తెలుసా?

Rohit Sharma names the two retired players he would love to bring back in Mumbai Indians squad

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌ ఎవరైనా ఉ‍న్నారంటే అది టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మనే. నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్స్‌ గెలిచి రికార్డు సాధించాడు. ఇక్కడ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కంటే హిట్‌మ్యాన్‌ ఒక టైటిల్‌ అధికంగానే గెలిచాడు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌.. మహీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్ ‌(సీఎస్‌కే)ను ఓడించి నాల్గోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ప్రశాంతంగా ఉంటూ అందరి సలహాలూ తీసుకుంటూ జట్టు సభ్యులకు స్వేచ్ఛనిస్తూ తన నాయకత్వ సత్తా ఏంటో నిరూపించాడు. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పడు ఖాళీగా ఉన్న రోహిత్ ఆదివారం ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

 సచిన్, పొలాక్‌లను ఎంచుకుంటా:

సచిన్, పొలాక్‌లను ఎంచుకుంటా:

ప్రశ్నోత్తరాల సెషన్లో భాగంగా.. 'అవకాశం ఉంటే ముంబై జట్టు నుంచి వీడ్కోలు పలికిన వారిలో ఏ ఆటగాడిని పునరాగమనం చేయిస్తావు'? అని రోహిత్ శర్మను ఓ అభిమాని అడిగాడు. ఆ ప్రశ్నకు హిట్‌మ్యాన్‌ ఇచ్చిన సమాధానం నెటిజన్లను ఆకట్టుకుంది. 'అవకాశం ఉంటే ఒక్కరిని మాత్రమే ఎంచుకోను. సచిన్‌ టెండూల్కర్, షాన్‌ పొలాక్‌లను ఎంచుకుంటా' అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు. అతడి జవాబును ట్యాగ్‌ చేస్తూ ముంబై ఇండియన్స్‌ 'సచిన్‌, పొలాక్‌.. పునరాగమనం గురించి మీరేమంటారు?' అని సరదాగా అడిగింది.

ఓపెనింగ్‌ చేయడం సరదాగా ఉంటుంది:

ఓపెనింగ్‌ చేయడం సరదాగా ఉంటుంది:

ముంబై ఇండియన్స్‌ ప్రశ్నకు సచిన్‌, పొలాక్ స్పందించారు. 'నీతో కలిసి ఓపెనింగ్‌ చేయడం సరదాగా ఉంటుంది రోహిత్‌' అని సచిన్ అన్నాడు. 'వీలైతే నెట్స్‌కు వెళ్తాను. కసరత్తులు చేస్తాను' అని పొలాక్‌ బదులిచ్చాడు. ప్రస్తుతం మబై ఇండియన్స్‌కు సచిన్‌ మార్గదర్శకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. లీగ్‌ మొదలైనప్పటి నుంచీ ఆయనకు జట్టుతో ఏదో ఒకరకంగా అనుబంధం ఉంటోంది. ఇక దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ షాన్‌ పొలాక్‌ 2008లో ముంబయి తరఫున 13 మ్యాచులో 11 వికెట్లు తీశాడు. 2009లో కోచ్‌గా పనిచేశాడు. 2011లో బౌలింగ్‌ కోచ్‌, మెంటార్‌గా ఉన్నాడు.

 నా తొలి సంపాదన రూ.50:

నా తొలి సంపాదన రూ.50:

చిన్నప్పుడు ఇంటి సమీపంలో ఓ లోకల్‌ మ్యాచ్‌ గెలిచినందుకు రూ. 50 నగదు బహుమతిగా వచ్చిందట, దాన్ని స్నేహితులతో కలిసి వడాపావ్‌ తినేందుకు ఖర్చు చేశానని రోహిత్‌ శర్మ వెల్లడించాడు. 'మీ తొలి పేచెక్‌ ఎంత?' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్‌ స్పందిస్తూ... 'నేను పేచెక్‌ అందుకోలేదు. మా ఇంటి దగ్గర మ్యాచ్‌ ఆడి రూ.50 నగదు బహుమతి గెలుచుకున్నా. ఆ డబ్బుతో నా స్నేహితులమంతా కలిసి రోడ్డుపక్కన వడాపావ్‌ తిన్నాం' అని తెలిపాడు.

 దక్షిణాఫ్రికాపై చేసిన సెంచరీ ఇష్టం:

దక్షిణాఫ్రికాపై చేసిన సెంచరీ ఇష్టం:

ప్రపంచకప్ 2019లో వరుసగా ఐదు సెంచరీలు బాది క్రికెట్ చరిత్రలోనే రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. అయితే ఆ సెంచరీలు అన్నింటిలో తనకిస్టమైన సెంచరీ మాత్రం మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై చేసిందేనని అంటున్నాడు. ప్రశ్నోత్తరాల సెషన్లో భాగంగా.. ప్రపంచకప్‌లో మీకు నచ్చిన సెంచరీ ఏదని ఓ అభిమాని అడిగాడు. 'దక్షిణాఫ్రికాపై చేసిందే. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేసింది తక్కువ పరుగులే. కానీ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోంది. ప్రత్యర్థి బౌలర్లు కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో సెంచరీ కొట్టడం చాలా ఆనందంగా ఉంది' అని రోహిత్ పేర్కొన్నాడు.

భారత క్రికెట్‌లో నా భవిష్యత్తును ధోనీ కళ్లకు కట్టాడు: యువరాజ్‌

Story first published: Tuesday, August 4, 2020, 9:40 [IST]
Other articles published on Aug 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X