న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్పైడర్ మ్యాన్ సృష్టికర్త స్టాన్ లీకి నివాళి అర్పించిన రోహిత్ శర్మ

Rohith Sharma Pays Tribute To Stan Lee In His Twitter | Oneindia Telugu
Rohit Sharma, Mumbai Indians pay tribute to Marvel stalwart Stan Lee

హైదరాబాద్: స్పైడర్ మ్యాన్ సృష్టికర్త స్టాన్ లీకి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ నివాళులు అర్పించాడు. లాస్ ఏంజిల్స్‌లోని సిడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో స్టాన్ లీ చివ‌ర శ్వాస విడిచారు. హాలీవుడ్‌లో ఫాద‌ర్ ఆఫ్ పాప్ క‌ల్చ‌ర్‌గా స్టాన్ లీకి గుర్తింపు ఉన్న‌ది. ఆయ‌న వ‌య‌సు 95 ఏళ్లు.

స్పైడ‌ర్ మ్యాన్‌, ఎక్స్‌ మెన్‌, థోర్‌, ఐర‌న్ మ్యాన్‌, బ్లాక్ ప్యాంథ‌ర్, ద ఫెంటాస్టిక్ ఫోర్ లాంటి సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ల‌ను సినీ ప్రేక్ష‌కులకు అందించిన మేటి ర‌చ‌యిత‌, ఎడిట‌ర్‌, ప‌బ్లిష‌ర్‌. దీంతో ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ సూట్స్ ధరించిన వారితో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్టు చేసి స్టాన్‌లీ మృతికి రోహిత్ శర్మ సంతాపం తెలిపాడు.

ప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్: కూతకెళ్లి తొడగొట్టిన ధోనిప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్: కూతకెళ్లి తొడగొట్టిన ధోని

"మిమ్మల్ని ఖచ్చితంగా మిస్ అవుతారు. మీరు లేకుండా ఏ మార్వెల్ సినిమా పూర్తికాదు. ఎంతో మంది గొప్ప సూపర్ హీరోలను మాకు ఇచ్చేసి వెళుతున్నందుకు ధన్యవాదాలు. నా అభిమాన సూపర్ హీరో అయిన హల్క్‌ను ఇచ్చినందుకు కృతజ్ఞతలు" అని ట్వీట్ చేసిన స్టాన్‌‌లీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ పాంథర్, థోర్, యాంట్ మ్యాన్ వంటి ఎన్నో ప్రఖ్యాత క్యారెక్టర్స్‌ను సృష్టించిన స్టాన్ లీ‌ క్రియేషన్స్‌లో హల్క్ క్యారెక్టర్‌‌కు రోహిత్ వీరాభిమాని. మార్వెల్ కామిక్స్ కోసం ఆయ‌న 1961లో తొలిసారి ద ఫెంటాస్టిక్ ఫోర్ క్యారెక్ట‌ర్ల‌ను క్రియేట్ చేశారు.

ఆ త‌ర్వాత స్పైడ‌ర్ మ్యాన్‌, ద ఇంక్రెడిబుల్ హ‌ల్క్ లాంటి సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ల‌నూ సృష్టించాడు. రోహిత్ శర్మను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లో నాలుగు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌ రోహిత్ శర్మనే కావడం విశేషం.

Story first published: Tuesday, November 13, 2018, 19:31 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X