న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌కు గాయం.. 11 ఏళ్ల తర్వాత మ్యాచ్‌కు దూరం

IPL 2019 : Rohit Sharma Misses First IPL Match In 11 Years || Oneindia Telugu
 Rohit Sharma misses an IPL match for first time in 11 years over Injury

టీమిండియా వైస్‌ కెప్టెన్, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ గాయం కారణంగా 11 ఏళ్ల తర్వాత ఓ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అయితే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మాత్రం కాదు.. ఐపీఎల్ లీగ్‌లో. బుధవారం రాత్రి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో గత 11 ఏళ్లలో రోహిత్ గాయంతో ఐపీఎల్‌ మ్యాచ్‌కు దూరం కావడం ఇదే తొలిసారి.

సీజన్-1లో గాయం:

సీజన్-1లో గాయం:

ఐపీఎల్‌ సీజన్-1లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తరపున ఆడుతున్నప్పుడు రోహిత్‌.. గాయపడి మ్యాచ్‌ ఆడలేదు. అనంతరం జరిగిన పది సీజన్లలో రోహిత్ ఎలాంటి గాయాలకు గురికాలేదు. ఈ సీజన్-12లో ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌.. తొడ కండరాలు పట్టేయడంతో 6వ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ముందస్తు జాగ్రత్తగా మ్యాచ్‌కు దూరం:

ముందస్తు జాగ్రత్తగా మ్యాచ్‌కు దూరం:

రోహిత్‌ శర్మకు అయిన గాయం తీవ్రమైందేమీ కాదని సమాచారం తెలుస్తోంది. త్వరలో ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా రోహిత్ మ్యాచ్‌కు దూరమయ్యాడని సమాచారం. మరోవైపు బీసీసీఐ కూడా రోహిత్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఫీల్డింగ్‌ చేస్తూ డైవ్‌ చేయగా:

ఫీల్డింగ్‌ చేస్తూ డైవ్‌ చేయగా:

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌ కోసం ముంబై జట్టు ప్రాక్టీస్ షెషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగా రోహిత్ మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తూ డైవ్‌ చేయగా.. కుడికాలు కండరాలు పట్టేయడంతో నొప్పితో గ్రౌండ్‌లోనే ఉండిపోయాడు. ముంబై జట్టు వైద్యుడు నితిన్‌ పటేల్‌ మైదానంలోకి వచ్చి రోహిత్‌ను తీసుకెళ్లి చికిత్స చేసాడు.

కోలుకునే అవకాశం ఉంది:

కోలుకునే అవకాశం ఉంది:

ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ 15న పంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. పంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో.. భారత జట్టులో రోహిత్‌ కీలక ఆటగాడు రోహిత్‌ శర్మ గాయంపై బీసీసీఐ ఆందోళన చెందుతోంది. అయితే పంచకప్‌కు ఇంకా నెల్లన్నరకు పైగా సమయం ఉంది కాబట్టి ఆలోపు రోహిత్‌ కోలుకునే అవకాశం ఉంది.

Story first published: Thursday, April 11, 2019, 8:52 [IST]
Other articles published on Apr 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X