న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సహనాన్ని కోల్పోయిన రోహిత్.. థర్డ్‌ అంపైర్‌పై అసభ్య పదజాలం (వీడియో)!!

India vs Bangladesh 2019 : Rohit Sharma Angry After Third Umpire Displays Wrong Decision !
Rohit Sharma Loses Cool After Error On large display Screen

రాజ్‌కోట్‌: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (85; 43 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్‌ 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. చివరి మ్యాచ్‌ ఆదివారం నాగ్‌పూర్‌లో జరుగుతుంది.

మూడు ఫార్మాట్‌లలో తొలి 100వ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు ఎవరంటే?!!మూడు ఫార్మాట్‌లలో తొలి 100వ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు ఎవరంటే?!!

పుజారాపై ఆగ్రహం:

పుజారాపై ఆగ్రహం:

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పరుగు తీయడానికి చతేశ్వర పుజారా వెనకడుగేయడంతో సహనాన్ని కోల్పోయి తన నోటికి పని చెప్పిన రోహిత్‌.. రెండో టీ20లో మరోసారి అదే ఘటనను పునరావృతం చేసాడు. అయితే ఈసారి ఏకంగా థర్డ్‌ అంపైర్‌పై తన కోపాన్ని ప్రదర్శించాడు. థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ విషయంలో తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో రోహిత్ అతనిపై అసభ్య పదజాలం వాడాడు. పుజారాపై ఆగ్రహం:

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పరుగు తీయడానికి చతేశ్వర పుజారా వెనకడుగేయడంతో సహనాన్ని కోల్పోయి తన నోటికి పని చెప్పిన రోహిత్‌.. రెండో టీ20లో మరోసారి అదే ఘటనను పునరావృతం చేసాడు. అయితే ఈసారి ఏకంగా థర్డ్‌ అంపైర్‌పై తన కోపాన్ని ప్రదర్శించాడు. థర్డ్‌ అంపైర్‌ ఔట్‌ విషయంలో తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో రోహిత్ అతనిపై అసభ్య పదజాలం వాడాడు.

ఔట్ అయినా.. నాటౌట్‌:

ఔట్ అయినా.. నాటౌట్‌:

ఇంతకు ఏం జరిగిందంటే... బంగ్లా ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ను స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌ వేస్తున్నాడు. చహల్‌ వేసిన ఓ బంతికి సౌమ్య సర్కార్‌ (30; 2 ఫోర్లు, 1 సిక్స్)ను రిషభ్‌ పంత్‌ స్టంపౌట్‌ చేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌కు అనుమానం ఉండడంతో థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడు. అంపైర్‌ నిర్ణయం కోసం సౌమ్య సర్కార్‌ బౌండరీ లైన్‌ వద్ద నిరీక్షిస్తున్నాడు. సౌమ్య క్లియర్‌గా ఔట్‌ అని రిప్లైలో తేలినా.. స్క్రీన్‌ మీద నాటౌట్‌ అని డిస్‌ప్లే అయ్యింది.

అంపైర్‌పై అసభ్య పదజాలం:

అంపైర్‌పై అసభ్య పదజాలం:

స్క్రీన్‌ చూసిన రోహిత్‌ తన సహనాన్ని కోల్పోయాడు. ఫీల్డ్‌ అంపైర్‌ పక్కన ఉండగానే థర్డ్‌ అంపైర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. అయితే సౌమ్య ఔటేనని ఫోర్త్‌ అంపైర్‌ ప్రకటించాడు. అంపైర్‌పై రోహిత్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. క్రికెట్ అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లవర్షం కురిపిస్తున్నారు.

రోహిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌:

రెండో టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. మహ్మద్‌ నయీమ్‌ (31 బంతుల్లో 5 ఫోర్లతో 36) టాప్‌ స్కోరర్‌. చాహల్‌కు రెండు వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో భారత్‌ 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రోహిత్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. శిఖర్ ధావన్ (27 బంతుల్లో 4 ఫోర్లతో 31) ఫర్వాలేదనిపించాడు. అమినుల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Story first published: Friday, November 8, 2019, 16:20 [IST]
Other articles published on Nov 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X