న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ వెంటపడుతున్నా అశ్విన్ పట్టించుకోలేదు!! (వీడియో)

Rohit Sharma left embarrassed as Ravichandran Ashwin ignores his handshake request in Adelaide

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో విజయానికి భారత్ జట్టు బాటలు వేసుకుంది. 323 పరుగుల లక్ష్యఛేదనకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 84/4తో పీకల్లోతు కష్టాల్లో కొనసాగుతోంది. పిచ్ నుంచి సహకారం లభిస్తుండటంతో.. ఓపెనర్ అరోన్ ఫించ్ (11), ఉస్మాన్ ఖవాజా (8) వికెట్లను పడగొట్టిన అశ్విన్ ఆ జట్టుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అయితే.. ఆదివారం మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చిన ఫించ్

టెస్టులో నాలుగోరోజైన ఆదివారం భారత్ జట్టు 307 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం ఆస్ట్రేలియా జట్టు లక్ష్య ఛేదనని ఆరంభించింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేయడంలో విఫలమైన అరోన్ ఫించ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే అంపైర్లు టీ బ్రేక్ ఇవ్వడంతో.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌తో పాటు భారత్ జట్టు డ్రెస్సింగ్ రూమువైపు కదిలింది.

షేక్‌హ్యాండ్ కోసం కొన్ని క్షణాలపాటు అలానే

ఆస్ట్రేలియా తొలి వికెట్ పడగొట్టిన అశ్విన్‌ను అభినందించేందుకు అతడి వెనుకే వెళ్లిన రోహిత్ శర్మ.. షేక్‌హ్యాండ్ కోసం కొన్ని క్షణాలపాటు అలానే అశ్విన్‌వైపు చేయి చూపిస్తూ నడిచాడు. కానీ.. అశ్విన్‌ నుంచి అతనికి స్పందన కరవైంది. దీంతో.. వెనకి నుంచి అశ్విన్ భుజంపై తట్టి రోహిత్ అభినందించి సరిపెట్టుకున్నాడు.

 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి

323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి

ఇంతటి భారీ టార్గెట్‌ను చేధించడం ఆస్ట్రేలియాకు దాదాపు అసాధ్యమే. ఇక భారత బౌలర్లు చక్కగా రాణిస్తే విజయాన్ని త్వరగానే చేరుకోవచ్చు. ఆస్ట్రేలియాకి తొలి టెస్టులోనే పర్యాటక భారత్ జట్టు సవాల్ విసిరింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా (71: 204 బంతుల్లో 9 ఫోర్లు), అజింక్య రహానె (70 బ్యాటింగ్: 147 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచరీలు బాదడంతో 323 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి భారత్ నిర్దేశించింది.

దాదాపు టీమిండియా గెలిచినట్లే

దాదాపు టీమిండియా గెలిచినట్లే

టెస్ట్ విజ‌యం కోసం ప‌రిత‌పిస్తున్న ఇండియాకి ఈ మ్యాచ్‌లో గెలిచే అవ‌కాశాలు సుస్ఫ‌ష్టంగా కనిపిస్తున్నాయి. ఆటలో నాలుగో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 151/3తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమవడంతో 307 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 15 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని 323 పరుగుల టార్గెట్‌ ఆస్ట్రేలియా ముందు నిలిచింది.

1
43623
Story first published: Sunday, December 9, 2018, 13:39 [IST]
Other articles published on Dec 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X