రోహిత్ శర్మకు ఐదో వన్డేలో చోటు కల్పించట్లేదా..?

Posted By: Subhan
Rohit Sharma, failing in South Africa, will return on flatter pitches

హైదరాబాద్: వరుస పరాజయాలు చవిచూస్తున్న రోహిత్ శర్మను మళ్లీ జట్టులోకి తీసుకుంటారా.. అతను తిరిగి తన ఫామ్‌ను సంపాదించుకోగలడా అనేది ప్రశ్నగా మారిపోయింది. మరి కొద్ది గంటల్లో మొదలుకాబోతున్న భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదో వన్డే మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో మార్పులు చోటు చేసుకుంటున్నాయని సమాచారం. దీంతో రోహిత్ శర్మను జట్టులోకి తీసుకుంటున్నట్టా.. లేదా అన్నది తెలియాల్సి.. తేలాల్సి ఉంది.

దక్షిణాఫ్రికా గడ్డపై పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న భారత ఓపెనర్ రోహిత్ స్థానంపై పలు వివాదాలు తలెత్తాయి. సిరీస్ ఆరంభంలో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన అతడ్ని మూడో టెస్టు నుంచి టీమిండియా మేనేజ్‌మెంట్ అప్పట్లో తప్పించింది. తాజాగా ఆరు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వన్డేల్లోనూ అదే ప్రదర్శన కొనసాగిస్తుండటంతో అతని చోటు సందేహస్పదంగా మారింది.

'ఐదో వన్డే మాదే'.. భారత్ బౌలింగ్ అర్థమైపోయింది, గెలుపును కొనసాగిస్తాం

నాలుగు వన్డేల్లోనూ రోహిత్ శర్మ వరుసగా 20, 15, 0, 5 స్కోర్లతో విఫలమయ్యాడు. దీంతో ఐదో వన్డేలో అతనిపై వేటు వేయాలనే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉందట. కానీ.. గత ఏడాది చివర్లో వన్డేలో డబుల్ సెంచరీ, టీ20లో శతకం బాదిన రోహిత్ శర్మ.. మళ్లీ ఫామ్ అందుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని కోహ్లి పట్టుబడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

తనకి అచ్చొచ్చిన వన్డే, టీ20ల్లో కూడా దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ వి‌ఫలమవుతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వన్డే, టీ20లకి వాడే తెలుపు రంగు బంతితో పోలిస్తే.. టెస్టులకి వాడే ఎరుపు రంగు బంతి కొంచెం నెమ్మదిగా బ్యాట్‌పైకి వస్తుంది. కానీ.. టెస్టుల్లో కూడా రోహిత్ వన్డే తరహా ఆట ఆడటంతో.. బంతి గాల్లోకి లేస్తోందని ఇదే సుదీర్ఘ ఫార్మాట్‌లో అతని ఫెయిల్యూర్‌కి కారణమన్నారు. టెస్టు ఫార్మాట్‌కి రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి సరిపోదని సుదీర్ఘకాలంగా మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.

5వ వన్డే: తుది జట్టులో మార్పులు తప్పవా, నెట్స్‌లో ధోని స్పిన్ బౌలింగ్ (వీడియో)

సఫారీ పిచ్‌లపై బౌలర్లకి లభిస్తున్న అదనపు బౌన్స్‌ని రోహిత్ అంచనా వేయలేకపోతుండటమే అతని బలహీనత. వన్డే సిరీస్‌లో ఏకంగా ఆరు సార్లు రబాడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇందులో అదనపు బౌన్స్ కారణంగానే 3 సార్లు ఈ ఓపెనర్ వికెట్ సమర్పించుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, February 13, 2018, 14:14 [IST]
Other articles published on Feb 13, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి