న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంత్ నువ్వేం తప్పు చేయలేదు.. పెద్దగా వర్రీ అవ్వకు అంటూ క్లాస్ పీకిన రోహిత్ శర్మ

Rohit Sharma defending Rishabh Pants captaincy despite making mistake in not taking DRS

నిన్నటి మ్యాచ్‌లో ముంబై గెలవడానికి ఢిల్లీ ప్లేఆఫ్ చేరకుండానే ఇంటి బాట పట్టడానికి ప్రధాన కారణం టిమ్ డేవిడ్. ఈ మ్యాచ్ చివర్లో 11 బంతులను మాత్రమే ఎదుర్కొన్న టిమ్ డేవిడ్ 34పరుగులు పిండుకున్నాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మ్యాచ్ మొత్తాన్నీ మలుపు తిప్పేశాడీ సింగపూర్-ఆస్ట్రేలియన్ క్రికెటర్. అయితే తాను ఎదుర్కొన్న తొలి బంతికే టిమ్ డేవిడ్ అవుట్ అయ్యాడు గానీ.. ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ డీఆర్ఎస్ కోరుకోకపోవడం వల్ల బచాయించిపోయాడు. దీంతో మ్యాచ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక డీఆర్‌ఎస్ కోరుకోకపోవడంపై పంత్ పట్ల ట్రోల్స్, నిందలు, కామెంట్లు పెరిగాయి. ఈ క్రమంలో పంత్‌ను పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా రోహిత్ శర్మ సైతం పంత్‌కు సపోర్ట్‌గా మాట్లాడాడు.

'అతనో క్వాలిటీ కెప్టెన్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇదివరకు జరిగిన సీజన్లలో అతనెలా కెప్టెన్సీ చేశాడో మనం చూశాం. కొన్నిసార్లు మనం అనుకున్నట్లు అన్ని జరగవు. ఇక పంత్ చేసిన మిస్టేక్స్ చాలా సింపుల్ విషయం అని రోహిత్ శర్మ చెప్పాడు. నేను ఇంతకుముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. నేను అదే విషయం గురించి అతనికి చెబుతున్నా. ఈ రకమైన మిస్టేక్స్ అప్పుడప్పుడు జరుగుతాయి. అది ఊహించనట్లు జరగలేదంతే. కాబట్టి ఇందులో తప్పేమీ లేదని' రోహిత్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం పంత్‌తో తాను మాట్లాడినట్లు రోహిత్ పేర్కొన్నాడు.

Rohit Sharma defending Rishabh Pants captaincy despite making mistake in not taking DRS


వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పంత్ మరింత బలమైన పాత్రగా, కెప్టెన్‌గా అవతరిస్తాడనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని రోహిత్ చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 2020లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఫైనల్‌కు చేరుకుంది. గతేడాది పంత్ కెప్టెన్సీలో ప్లేఆఫ్‌ వరకు చేరుకుంది. అయినప్పటికీ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆ జట్టు ఐపీఎల్ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఇక పంత్ గురించి రోహిత్ మాట్లాడుతూ.. 'ఇలాంటి మిస్టేక్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇలాంటి మిస్టేక్స్‌ను సింపుల్‌గా తీసుకోవాలి. అతను మనస్ఫూర్తిగా ఏ తప్పు చేయలేదు. అతను ఆటను వికెట్ల వెనుక నుండి ఆద్యంతం గమనిస్తున్నాడు. ఐపీఎల్ అంటేనే అధిక ఒత్తిడితో కూడిన టోర్నమెంట్. ఆ ఒత్తిడి వల్ల చిన్న పొరపాట్లు జరగవచ్చు. అలాంటి టైంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. మనల్ని మనం అనుమానించుకోవడం ప్రారంభించొద్దు. నేను మ్యాచ్ అనంతరం అతనితో మాట్లాడి.. కాస్త ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలని చెప్పాను. అతను వచ్చే సీజన్‌లో కచ్చితంగా మరింత ఉత్తేజంతో ప్లేయర్‌గా, సారథిగా తిరిగొస్తాడని రోహిత్ పేర్కొన్నాడు.
Story first published: Sunday, May 22, 2022, 16:50 [IST]
Other articles published on May 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X