న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విమర్శల ప్రభావం నాపై పడకుండా జాగ్రత్త పడ్డా: రహానే

India vs West Indies Series 2019: I Try Not To Get Affected By Criticism - Ajinkya Rahane
Rohit Sharma chat on bccitv: I try not to get affected by criticism says Ajinkya Rahane

ఆంటిగ్వా: టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే సెంచరీ చేసి దాదాపు రెండేళ్లైంది. చివరకు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ (102; 242 బంతుల్లో 5×4) బాదాడు. 17 టెస్టు మ్యాచ్‌ల అనంతరం సెంచరీ నమోదు చేయడంతో రహానే విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యాడు. వెస్టిండీస్‌పై సాధించిన ఈ సెంచరీ చాలా ప్రత్యేకం అని రహానే పేర్కొన్నాడు. ఫామ్‌లో లేని సమయంలో వచ్చిన విమర్శల ప్రభావం మీదపడకుండా జాగ్రత్త పడ్డా అని తెలిపాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ 2019.. ఈ వారంలో టాప్ 3 రైడ్‌లు ఇవే!! (వీడియో)

తాజాగా రోహిత్ శర్మ నిర్వహించిన బీసీసీఐ టీవీతో రహానే మాట్లాడుతూ... 'విమర్శల ప్రభావం మీద పడకుండా జాగ్రత్త పడ్డా. ఎందుకంటే అవి ఉపయోగం లేనివి. అయితే విమర్శలను మాత్రం నేను నియంత్రించలేను. సెంచరీ చేసిన ప్రతిసారీ ఏ ఆటగాడైనా సంతోషపడతాడు. నేను కూడా అంతే. ఎన్నో కష్టాల తర్వాత సాధించాను కాబట్టి కొంచెం ఎక్కువ ఉద్వేగానికి లోనయ్యా. సెంచరీ కన్నా ముందు జట్టును పటిష్ఠ స్థితిలో నిలపడం ముఖ్యం' అని రహానే తెలిపాడు.



మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ... 'నాకు చాలా ఆనందంగా ఉంది. 17 టెస్టు మ్యాచ్‌ల తర్వాత సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. 70 నుంచి 80 పరుగుల మధ్యలో పరుగులు చేస్తున్నా.. రెండేళ్ల నుంచి టెస్టు సెంచరీ లేదు. ఈ సెంచరీ ఎంతో ప్రత్యేకం. కష్టకాలంలో అండగా ఉన్న అందరికీ అంకితం ఇస్తున్నా' అని రహానే తెలిపాడు. తొలి టెస్టులో రహానే (81; 102) కీలక ఇన్నింగ్సులు ఆడాడు.

తొలి సెషన్‌లో రహానే కీలక సమయంలో 81 పరుగులు చేసాడు. రాహుల్‌, మయాంక్‌, కోహ్లీ ఔటైన తర్వాత ఒత్తిడిలో అతడు జట్టుకు అండగా నిలిచాడు. రహానే అద్భుతంగా ఆడడంతో తొలి టెస్టులో భారత్‌ 318 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. రెండు ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడిన రహానే (81, 102) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు శుక్రవారం కింగ్‌స్టన్‌లో జరగనుంది.

Story first published: Tuesday, August 27, 2019, 16:40 [IST]
Other articles published on Aug 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X