Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రొ కబడ్డీ లీగ్‌ 2019.. ఈ వారంలో టాప్ 3 రైడ్‌లు ఇవే!! (వీడియో)

PKL 2019: Top 3 raids from Week 5, Pro Kabaddi post a video

ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌-7లో భాగంగా ప్రస్తుతం మ్యాచ్‌లు ఢిల్లీ అంచెలో జరుగుతున్నాయి. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం దబాంగ్ ఢిల్లీ 39 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. 37 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ రెండో స్థానంలో.. 34 పాయింట్లతో బెంగాల్ వారియర్స్ తృతీయ స్థానంలో ఉంది. వరుస పరాజయాలతో సతమవుతున్న తెలుగు టైటాన్స్ 23 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతోంది.

పవన్‌ @ 100

పవన్‌ @ 100

ఈ సీజన్‌లో రైడర్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సెరావత్‌, నవీన్ కుమార్, పర్దీప్ నర్వాల్, సిద్దార్థ్ దేశాయ్, మణిందర్ సింగ్ లాంటి రైడర్‌లు టాప్ 5లో ఉన్నారు. వీరందరు తమ తమ జట్లకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెడుతున్నారు. ఈ సీజన్‌లో 100 రైడ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా బెంగళూరు బుల్స్‌ అగ్రశ్రేణి రైడర్‌ పవన్‌ కుమార్‌ సెరావత్‌ (128) నిలిచాడు. అనంతరం ఢిల్లీ స్టార్ రైడర్‌ నవీన్‌ కుమార్‌ (104) 100 రైడ్ పాయింట్లు సాధించాడు.

టాప్ రైడ్‌లు కిక్కెక్కిస్తున్నాయి:

ఇదిలా ఉంటే.. రైడర్‌లు ఈ వారంలో ఒకసారి మూడు రైడ్ పాయింట్లతో చెలరేగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో టాప్ 3 రైడ్‌లు కిక్కెక్కిస్తున్నాయి. హరియాణా స్టీలర్స్‌ రైడర్ వికాస్‌ ఖండోలా, జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ దీపక్ హుడా, తమిళ్ తలైవాస్ రైడర్ అజిత్ కుమార్‌లు బెస్ట్ రైడ్‌లు చేశారు. వీరికి సంబందించిన వీడియోను ప్రొ కబడ్డీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మీరు ఓ లుక్కేయండి.

హరియాణా జోరు:

హరియాణా జోరు:

ప్రొ కబడ్డీ లీగ్‌-7లో హరియాణా స్టీలర్స్‌ జోరు కొనసాగుతోంది. రైడర్లు వికాస్‌ ఖండోలా (11), వినయ్‌ (9) చెలరేగడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 36-33 తేడాతో బెంగాల్‌ వారియర్స్‌ను కంగుతినిపించింది. వారియర్స్‌ రైడర్‌ మణీందర్‌ సింగ్‌ 15 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో యూపీ యోధ 35-30తో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. యూపీ రైడర్ శ్రీకాంత్‌ జాదవ్‌ 15 రైడ్‌ పాయింట్లతో అదరగొట్టాడు. పల్టాన్‌ తరఫున మంజీత్‌ 16 పాయింట్లతో మెరిశాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం.

Story first published: Tuesday, August 27, 2019, 16:05 [IST]
Other articles published on Aug 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+