న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ టెస్టుల్లోనూ ధీటుగా, తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు వస్తేనే..

Rohit Sharma can be a destructive batsman like Viv Richards, Virender Sehwag in Tests - Sunil Gavaskar

హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతోన్న సిరీస్‌లలో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోన్న రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రోహిత్‌.. ఆస్ట్రేలియాతో టెస్టుల్లోనూ దక్కించుకోవడంతో మరింతగా రాణించి సత్తా చాటగలడని భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.

రోహిత్‌ను తప్పించడాన్ని తప్పుబట్టిన సెహ్వాగ్‌

రోహిత్‌ను తప్పించడాన్ని తప్పుబట్టిన సెహ్వాగ్‌

ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో రోహిత్‌ విఫలం కావడంతో.. చివరి టెస్టులో అతనిని తప్పించారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్‌కు చోటు దక్కలేదు. అయితే ఈ రెండు సిరీస్‌ల్లో రోహిత్‌ను తప్పించడాన్ని సెహ్వాగ్‌ తప్పుబట్టాడు.

వన్డేల్లో ఇప్పటికే 3 డబుల్‌ సెంచరీలు

వన్డేల్లో ఇప్పటికే 3 డబుల్‌ సెంచరీలు

‘రోహిత్‌ వన్డేల్లో ఇప్పటికే మూడు డబుల్‌ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తూ.. టెస్టుల్లో చోటు దక్కని ఆటగాడు నాకు తెలిసి ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ లేరు.' అని సెహ్వాగ్‌ అన్నాడు. ఇదిలా ఉండగా, ఇటీవల ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు రోహిత్‌కు చోటు కల్పించారు. అయితే ఈ సిరీస్‌లో రోహిత్‌ తుదిజట్టులో ఉండటం కీలకమని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

సెలక్టర్లను ప్రశ్నిస్తున్న మాజీ ఓపెనర్‌

సెలక్టర్లను ప్రశ్నిస్తున్న మాజీ ఓపెనర్‌

స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో రోహిత్‌ ఒక శతకం, అర్ధశతకంతో రాణించాడు. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో వెంటనే అతనిపై వేటు వేశారు. తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటనకు కూడా ఎంపిక చేయలేదు. అసలు సఫారీ గడ్డపై ఎంతమంది బ్యాట్స్‌మెన్‌ రాణించారు? అలాంటిది కేవలం అతనినే ఎందుకు తప్పించారు.

మొదటి ఇన్నింగ్స్‌లో రాణిస్తేనే.. విజయావకాశాలు

మొదటి ఇన్నింగ్స్‌లో రాణిస్తేనే.. విజయావకాశాలు

ఇంగ్లాండ్‌లో పిచ్‌లు స్వింగ్‌కు అనుకూలించగా, దక్షిణాఫ్రికా పిచ్‌లు సీమ్‌కు అనుకూలిస్తాయి. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే.. అక్కడ బంతి ఎక్స్‌ట్రా బౌన్స్‌ తిరుగుతుంది. ఒకవేళ దానికి అనుగుణంగా బ్యాట్స్‌మెన్‌ కుదురుకుంటే.. రోజు మొత్తం ఎక్కువ పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడికి వెళ్లే పర్యటక జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాణిస్తేనే.. విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Story first published: Sunday, November 11, 2018, 17:03 [IST]
Other articles published on Nov 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X