న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Test Rankings: దూసుకెళ్లిన రోహిత్ శర్మ, అశ్విన్‌.. హిట్‌మ్యాన్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్!

 Rohit Sharma attains career best 8th place in latest ICC Test rankings for batsmen
ICC Test Rankings: Rohit Sharma Attains Career Best Rank & Axar, Ashwin Make Solid Gains

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ రవించంద్రన్ అశ్విన్‌లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లారు. ఐసీసీ ఆదివారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఈ ఇద్దరూ మెరుగైన స్థానాలను అందుకున్నారు. చెన్నై టెస్ట్‌లో సెంచరీ, అహ్మదాబాద్ టెస్ట్‌లో హాఫ్ సెంచరీతో బ్యాటింగ్ విభాగంలో రోహిత్ శర్మ టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా ఆరు స్థానాలను మెరుగుపరచుకొని కెరీర్ బెస్ట్ 8వ ర్యాంకు అందుకున్నాడు.

రోహిత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంకు

రోహిత్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంకు

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ 2, 3 స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ 4, 5 స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. బాబర్ ఆజమ్, హెన్రీ నికోలస్ రోహిత్ కన్నా ముందున్నారు. వార్నర్ 9వ స్థానంలో కొనసాగుతుండగా.. రెండు స్థానాలు దిగజారిన టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఎగబాకిన అశ్విన్

ఎగబాకిన అశ్విన్

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌.. బౌలర్ల ర్యాంకుల్లో నాలుగు స్థానాలను మెరుగుపరుచుకొని మూడోస్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ టాప్‌లో ఉండగా.. ఇంగ్లండ్ స్టార్ పేసర్లు జేమ్స్ అండర్సన్ మూడు స్థానాలు, స్టువర్ట్ బ్రాడ్ ఒక స్థానం దిగజారి 6, 7 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం దిగజారి 9వ స్థానంలో నిలిచాడు.

అక్షర్ 30 స్థానాలు..

అక్షర్ 30 స్థానాలు..

అహ్మదాబాద్ టెస్ట్‌లో 11 వికెట్లతో సత్తాచాటిన టీమిండియా యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపరుచుకొని 34వ ర్యాంక్ అందుకున్నాడు. మూడు వికెట్లు తీసిన ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 3 స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచాడు. ఇక తొలిసారి 5 వికెట్ల ఘనతను అందుకున్న జోరూట్ 16 స్థానాలు మెరుగుపరుచుకొని 72వ ర్యాంక్ అందుకున్నాడు. ఆలౌరౌండర్ల జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా రెండో స్థానంలో, రవించంద్రన్ అశ్విన్ 5వ స్థానంలో ఉండగా.. జాసన్ హోల్డర్ టాప్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

 ఇక నుంచి ప్రతీ వారం..

ఇక నుంచి ప్రతీ వారం..

మార్చి 2021 నుంచి ర్యాంకింగ్స్‌ను ప్రతీవారం విడుదల చేయనున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు ప్రతీ వన్డే, టీ20 సిరీస్, టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ర్యాంకులు ప్రకటించేవారు. కానీ ఇక నుంచి ప్రతీవారం ర్యాంకులను ప్రకటించే కొత్త పద్దతిని ఐసీసీ కొనసాగించనుంది. ప్రతీ మంగళవారం మహిళల క్రికెట్ ర్యాంకింగ్స్, ప్రతీ బుధవారం పురుషుల క్రికెట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నారు. ఇలా వారం మధ్యలో మ్యాచ్‌లు జరిగితే ర్యాంకుల్లో మార్పు ఉంటుంది. లేకుంటే ర్యాంకుల్లో ఎలాంటి మార్పు ఉండదు.

Story first published: Sunday, February 28, 2021, 16:31 [IST]
Other articles published on Feb 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X