న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దినేశ్‌ కార్తీక్‌ ఎంపికపై రాబిన్‌ ఊతప్ప ఏమన్నాడంటే...

ICC Cricket World Cup 2019 : Robin Uthappa On Dinesh Karthik World Cup Selection || Oneindia Telugu
Robin Uthappa on Dinesh Karthik World Cup selection: Justice has been done

సోమవారం భారత ప్రపంచకప్‌ జట్టును ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. ప్రపంచకప్‌ జట్టులో స్థానంపై ఎంతో ఆశతో ఉన్న అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌లకు మొండిచేయి చూపించిన సెలక్టర్లు.. విజయ్‌ శంకర్‌, దినేశ్‌ కార్తీక్‌, రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌లకు అవకాశమిచ్చారు.

అతడికి న్యాయం జరిగింది:

అతడికి న్యాయం జరిగింది:

కార్తీక్‌ను ఎంపికపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఊతప్ప ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు. ' ఈ ప్రపంచకప్‌లో ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా అర్హత సాధించిన క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే అది దినేశ్‌ కార్తీక్‌. నాకు చాలా సంతోషంగా ఉంది. అతడికి న్యాయం జరిగింది. భారత జట్టులో గత రెండేళ్లుగా బెస్ట్‌ ఫినిషర్‌గా ఉన్నాడు' అని రాబిన్‌ ఊతప్ప పేర్కొన్నాడు.

అనుభవంకే ఓటు:

అనుభవంకే ఓటు:

యువ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు బదులు రెండో కీపర్‌గా దినేష్ కార్తీక్‌కే సెలక్షన్‌ కమిటీ ఓటేసింది. అనుభవం, నైపుణ్యం, ఒత్తిడిని జయించే సామర్థ్యం ఉన్న కార్తీక్‌పై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. పంత్‌ 5 వన్డేలు ఆడగా.. కార్తీక్‌ 91 వన్డేలు ఆడాడు. 2007 వరల్డ్‌ కప్‌లో కూడా దినేశ్‌ సభ్యుడు.

నాలుగో స్థానంలో ఆడే అవకాశం:

నాలుగో స్థానంలో ఆడే అవకాశం:

దినేశ్‌ కార్తీక్‌ సెప్టెంబరు 2004లో భారత జట్టులోకి అరంగేట్రం చేసాడు. అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూ సద్వినియోగం చేసుకున్నాడు. అయితే 2017 నుంచి ఇప్పటివరకు 20 వన్డేలు ఆడి 46.75 సగటుతో 425 పరుగులు చేశాడు. కార్తీక్ బ్యాకప్ కీపర్‌గా జట్టులో అవకాశం దక్కించుకున్నా.. నాలుగో స్థానంలో ఆడించే అవకాశం కూడా ఉంది. నాలుగో స్థానంపై ఇప్పటికి సెలక్షన్‌ కమిటీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ స్థానంకు విజయ్, రాహుల్, కార్తీక్‌లు పోటీ పడుతున్నారు.

Story first published: Tuesday, April 16, 2019, 13:36 [IST]
Other articles published on Apr 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X